Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల డీఏలను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల డీఏలను విడుదల చేసింది. కాగా ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వలను జారీ చేశారు. అలాగే పీఆర్ సీకి సంబంధించి 23 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా ఎన్నాళ్లగానో డీఏ బకాయిలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది డిసెంబర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలు, అనంతరం మంత్రులతో సమావేశమయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా వచ్చే జనవరి నెల నుంచి డీఏను జమ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను విడుదల చేయడానికి ఆర్దికశాఖ డిసెంబర్ లోనే అధికారిక ఉత్తర్వులిచ్చింది. నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఒకేసారి ఐదు పెండింగ్ డీఏ లను జనవరి జీతాలతో కలిపి విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా 23 శాతం ఫిట్మెంట్ తో పెరిగిన జీతాలు కూడా ఈనెలతోనే కలిపి ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 న పెరిగిన జీతాలు విడుదల కానున్నాయి.
Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..
చలికాలంలో తీపి తినాలనిపిస్తుందా.. ఇంట్లోనే రుచికరమైన బెల్లం అన్నం తయారు చేయండి..