Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..
Road Accident

ఏపీలోని గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది.  మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  అదుపుతప్పిన కారు  ఒక్కసారిగా చెరువులోకి  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న

Basha Shek

|

Jan 17, 2022 | 10:47 PM

ఏపీలోని గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది.  మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  అదుపుతప్పిన కారు  ఒక్కసారిగా చెరువులోకి  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు మృతి చెందారు.  కాగా ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. కృష్ణాయ పాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తుండగా ఎర్రబాలెం చెరువు వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే కారు పూర్తిగా అదుపు తప్పింది. చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తోన్న  సాయి, శ్రీనివాస్, నరేంద్రకుమార్, తేజ రాంజీ  అక్కడికక్కడే  మృత్యువాత పడ్డారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు  చెరువులోంచి  కారును బయటకు తీశారు.  అద్దాలను పగుల గొట్టి నలుగురిని కారులోంచి బయటకు తీసుకొచ్చారు  . దురదృష్టవశాత్తూ వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.  కాగా మృతుల్లో సాయి, శ్రీనివాస్, నరేంద్ర మంగళగిరి వాసులు కాగా, తేజ రాంజీ ఎర్రపబాలెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతులంతా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Also Read: Andhra Pradesh: ఇకపై ఏపీలో ఆ నాటకంపై నిషేధం.. ఎక్కడా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ..

బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. మూడేళ్ల ఎఫ్డీలపై పన్ను మినహాయింపు అవకాశం..!

Anand Mahindra: మంత్రి కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆనంద్ మ‌హీంద్ర‌.. ఎందుకో తెలుసా.?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu