Anand Mahindra: మంత్రి కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆనంద్ మ‌హీంద్ర‌.. ఎందుకో తెలుసా.?

Anand Mahindra: మ‌హీంద్రా గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఆనంద్ మ‌హీంద్ర నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తీ ఒక్క అంశంపై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటారు ఆనంద్‌. ఈ క్ర‌మంలోనే తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా...

Anand Mahindra: మంత్రి కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆనంద్ మ‌హీంద్ర‌.. ఎందుకో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2022 | 8:54 PM

Anand Mahindra: మ‌హీంద్రా గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఆనంద్ మ‌హీంద్ర నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తీ ఒక్క అంశంపై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటారు ఆనంద్‌. ఈ క్ర‌మంలోనే తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆనంద్ మ‌హీంద్ర తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదికగా త‌న చిర‌కాల స్వప్నాన్ని నిజం చేసింద‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఇంత‌కీ ఆనంద్ మ‌హీంద్ర, కేటీఆర్‌కు ఎందుకు థ్యాంక్స్ చెప్పార‌నేగా మీ సందేహం..

వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్నఈ-వ‌న్ ఛాంపియ‌న్‌షిప్‌ పోటీల‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ విష‌య‌మై ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు.

ఈ పోటీల్లో మ‌హీంద్రాకు చెందిన మ‌హీంద్రా రేసింగ్ కంపెనీ పాల్గొన‌నుంది. ఇదే విషయాన్ని ప్ర‌స్తావిస్తూ ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్ చేశారు. సొంత గ‌డ్డ‌పై త‌మ రేసింగ్ కార్లు ఉరుకులు పెట్ట‌బోతున్నాయి, మా చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేర‌బోతోంది. దీనిని నెర‌వేర్చే దిశ‌గా అడుగులు వేసిన కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ఆనంద్ మ‌హ్రీంద్రా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఛాంపియ‌న్ షిప్ పోటీలు ఇప్ప‌టి వ‌ర‌కు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వ‌నుంది.

Also Read: Covid Vaccine: వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కేంద్రం మ‌రో ముంద‌డుగు.. 12-14 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్ప‌టి నుంచంటే..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,108 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు

Andhra Pradesh: ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ