Covid Vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం మరో ముందడుగు.. 12-14 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్పటి నుంచంటే..
Covid Vaccine: కరోనా అంతానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఇదే మంత్రాన్ని పాటిస్తున్నాయి. కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో..
Covid Vaccine: కరోనా అంతానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఇదే మంత్రాన్ని పాటిస్తున్నాయి. కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకుపోతోంది. ఇప్పటికే పెద్దలకు 156 కోట్లకుపైగా డోసుల టీకాలు పంపిణీ చేసిన భారత ప్రభుత్వం తాజాగా.. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మొత్తం 7.4 మంది ఉండగా వీరిలో ఇప్పటి వరకు 3.45 కోట్ల మందికి తొలి డోసును ఇచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు సైతం టీకాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చిన్నారులకు మార్చి నెల నుంచి టీకాలు ఇచ్చే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్‌కే అరోరా తెలిపారు. అప్పటిలోగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికానుందని ఆయన తెలిపారు.
Amazing enthusiasm among Young India for #COVID19 vaccination ?
Over 3.5 crore children between the 15-18 Age group have received 1st dose of COVID-19 vaccine, since 3rd January.
Congratulations to all my young friends who have got vaccinated.#SabkoVaccineMuftVaccine pic.twitter.com/4sa8DzCIJ4
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 17, 2022
Also Read: AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,108 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు
Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?