Andhra Pradesh: ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ

సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం టీడీపీతో పాటు కొంతమంది పేరెంట్స్ సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. 

Andhra Pradesh: ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ
Adimulapu Suresh
Follow us

|

Updated on: Jan 17, 2022 | 4:18 PM

సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం టీడీపీతో పాటు కొంతమంది పేరెంట్స్ సెలవులు పొడిగించాలని కోరుతున్నారు.  ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ రెస్పాండ్ అయ్యారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని వివరించారు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని, భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలలు తిరిగి ప్రారంభించినట్లు వివరించారు. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతుందని, 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని వెల్లడించారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నట్లు వివరించారు. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

అకడమిక్ ఇయర్ ని ముందుగా నిర్ణయుంచుకున్న ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిక అనవసరమని.. గతంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే స్కూళ్లను ఆగస్టులోనే ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహిస్తున్నామని ఆదిమూలపు స్పష్టం చేశారు.

Also Read: స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎం​కు నారా లోకేశ్ లేఖ

పండుగపూట ఆ ఇంట తీరని విషాదం.. పల్లీలు గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..