చూసేకి చిన్నగా ఉన్నా.. గుడ్లు, మాంసం కంటే పవర్‌ఫుల్ ఇవి!
21 March 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రొటీన్ అంటే మనకి మాంసం, గుడ్లు, కందిపప్పు, చేపలు వంటివే చటుక్కున గుర్తుకొస్తాయి. అందుకే జిమ్‌కెళ్లేవాళ్లూ, వ్యాయామాలు చేసేవారు కూడా ఆరోగ్యకరమైన ప్రొటీన్ కోసం వీటినే ఎక్కువగా తింటూ ఉంటారు
TV9 Telugu
కానీ ఆశ్చర్యకరంగా కండబలం కోసం మెంతుల్లోని ప్రొటీన్ వీటన్నింటి కంటే ఎక్కువ. చూడ్డానికి చిన్నగా ఉన్నా, మెంతులతో ఆరోగ్యానికి చాలా లాభమట. ముఖ్యంగా వీటిని నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడుతుంది
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది
TV9 Telugu
తద్వారా అదనపు కెలొరీలు తీసుకునే అవకాశం ఉండదు. మెంతి పొడిని ఆహారంలో భాగం చేసుకున్న వాళ్లకు ఆకలి తగ్గి, తద్వారా బరువు నియంత్రణలోకి వచ్చినట్టు ఓ అధ్యయనం చెబుతోంది
TV9 Telugu
మెంతులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
TV9 Telugu
పాలిచ్చే తల్లులకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. 1-2 టేబుల్‌సూన్ల వరకూ నానబెట్టుకుని, నీటిని వడకట్టి గింజల్ని మాత్రమే తినొచ్చు కూడా.