PM Gati Shakti: సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేః మంత్రి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదే‌శ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకే వైఎస్ జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోంద‌ని, అందు కోసం పంచ సూత్రాలతో ముందుకెళతామని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

PM Gati Shakti: సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేః మంత్రి గౌతమ్ రెడ్డి
Gautham Reddy
Follow us

|

Updated on: Jan 17, 2022 | 3:16 PM

Minister Goutham Reddy in PM Gati Shakti: ఆంధ్రప్రదే‌శ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకే వైఎస్ జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోంద‌ని, అందు కోసం పంచ సూత్రాలతో ముందుకెళతామని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని తెలిపారు. ప్రతి రవాణా మార్గం మరో మార్గంతో పూర్తి అనుసంధానం ఏపీ ప్రత్యేకత చాటుకుందన్నారు. అందుకే చౌకగా సరకు రవాణా ప్రణాళికతో ఏపీ దూసుకెళుతుంద‌న్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను గ్రామ స్థాయికి చేర్చిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. పీఎం గతిశక్తిపై కేంద్ర సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ నియ‌మించింద‌ని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో “పీఎం గతిశక్తి”పై కేంద్రం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో 18 వేల కోట్ల రూపాయ‌ల‌తో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణంపై కేంద్ర పీఎం గ‌తి శ‌క్తి అధికారుల‌తో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రి గౌతమ్ రెడ్డి చ‌ర్చించారు. మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను పెంపొందించడంలో ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని మంత్రి తెలిపారు. ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మించడం సహా పోర్టుల ద్వారా సముద్ర వాణిజ్య అనుసంధానంలో ఏపీకి తిరుగులేదన్నారు. మల్టీ మోడల్ కార్గో హబ్ లు, సహజ వాయువుల పంపిణీ విస్తరణ ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో ఏపీ దూసుకెళ్లడం ఖాయమన్నారు.

రూ.18వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ వంటి 3 పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ కలుపుతూ యువతకు పెద్దయెత్తున ఉద్యోగవకాశాలతో పాటు రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ముందుకెళుతోందని మంత్రి వివరించారు.

ప్రపంచ బ్యాంక్ 2018లో వెల్లడించిన ర్యాంకింగ్ లలో భారత్ లాజిస్టిక్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (ఎల్ పీఐ)లో 44వ స్థానంలో నిలవడం ప్రధాని మోడీ దార్శనికతకు నిదర్శనంగా మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. సరకు రవాణాకు అవుతున్న ఖర్చు అందరికీ తెలుసు. కానీ ఎగుమతులలో ప్రపంచ సగటు 8 శాతంతో పోలిస్తే భారతదేశం ఇప్పటికీ 14శాతం సగటు ఉండడానికి కారణం ఎగుమతులలో ఎవరికీ అందనంత ఎత్తులో భారతదేశం ఉండడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read Also…   Goa Elections: సార్, ఏడుపు ఆపండి.. చిదంబరం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్