Goa Elections: సార్, ఏడుపు ఆపండి.. చిదంబరం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్

Aravind Kejriwal: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల 2022కి ముందు వివిధ రాజకీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది.

Goa Elections: సార్, ఏడుపు ఆపండి.. చిదంబరం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్
Chidambaram Kejriwal
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 17, 2022 | 2:53 PM

Goa Assembly Election 2022: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల 2022కి ముందు వివిధ రాజకీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. తమ తమ పార్టీలను రాష్ట్రానికి మెరుగైన పార్టీగా నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. గోవాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, గోవాలో పోరు కేవలం కాంగ్రెస్‌, బీజేపీ మధ్యేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. చిదంబరం ‘ఏడ్వడం ఆపు’ అంటూ ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే, పరోక్షంగా బిజెపికి ఓటు వేయడమే. గోవా ప్రజలు తెలివైన వాళ్లు అని, ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసన్నారు. ఫిబ్రవరి 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో ఓటమి పాలైన పక్షంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ప్రకటించారు.

ఇదిలావుంటే, గోవా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడు చిదంబరం, పాలనలో మార్పు కోసం తమ ఓటు వేసి కాంగ్రెస్‌ను ఎన్నుకోవాలని గోవా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘‘గోవాలో ఆప్, టీఎంసీలు బీజేపీయేతర ఓట్లను మాత్రమే విభజించగలవని నా అంచనాను అరవింద్ కేజ్రీవాల్ ధృవీకరించారు. గోవాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. చిదంబరం వరుస ట్వీట్లలో, “పరిపాలనను మార్చాలనుకునే వారు (10 సంవత్సరాల దుష్టపాలన తర్వాత) కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. ఈ పాలన కొనసాగించాలనుకునే వారు బీజేపీకి ఓటేస్తారు. అంటూ ట్వీట్ చేశారు.

గోవాలో ఓటర్ల ముందు ఆప్షన్ స్పష్టంగా ఉందని అన్నారు. మీరు పాలనలో మార్పు కోరుకుంటున్నారా లేదా అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. గోవా ఓటర్లు పాలనను మార్చి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిదంబరం అన్నారు. తన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, కేజ్రీవాల్ అతనిని తీవ్రంగా విమర్శించారు. “సార్, ఏడుపు ఆపండి – ‘హాయ్ రే, మర్ గయే రే, మా ఓటు కటకే రే. గోవా ప్రజలు ఎక్కడ ఆశచూపి ఓటేస్తారని ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ బిజెపికి అనుకూలంగా ఉంది. గోవా ప్రజలకు కాదు. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీలోకి మారారు. తమకు పడిన ప్రతి ఓటు బీజేపీకి భద్రంగా పడుతుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీజేపీకి ఓటు వేయడానికి సురక్షితమైన మార్గం కాంగ్రెస్ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఓటింగ్ జరగనుంది.

Read Also… Nara Lokesh: కరోనా బారిన పడ్డ నారా లోకేశ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో టీడీపీ యువనేత