AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Jyothi: నా టాటూకి అర్ధం అదే.. అసలు విషయం చెప్పిన నటి జ్యోతి

నటి జ్యోతి గుర్తుందా.. ? తెలుగులో ఒకప్పుడు ఫేమస్ నటి. అనేక సినిమాల్లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన జ్యోతి.. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తెలుగు సినీప్రియులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

Actress Jyothi: నా టాటూకి అర్ధం అదే.. అసలు విషయం చెప్పిన నటి జ్యోతి
Jyothi
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2026 | 9:37 PM

Share

నటి జ్యోతి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన నటి జ్యోతి. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో తిలోత్తమ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి జ్యోతి. ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై తన నిర్మొహమాటమైన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత కోరికలను వృత్తితో ముడిపెట్టడం అవివేకం అని ఆమె స్పష్టం చేశారు. ఒక పాత్రకు ఎంపిక చేయడం అనేది నటీనటుల ప్రతిభపై ఆధారపడాలి గానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని జ్యోతి అన్నారు.  క్యారెక్టర్ డిఫరెంట్. పర్సనల్ ప్లెజర్స్ డిఫరెంట్. మీరు వ్యక్తిగత ప్లెజర్స్ కావాలనుకుంటే, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి పొందండి. దానిని ప్రొఫెషన్ విషయంతో లింక్ చేయవద్దు” అని జ్యోతి అన్నారు. కేవలం టాలెంట్ ఆధారంగానే అవకాశాలు వస్తాయని, దీన్ని దుర్వినియోగం చేయవద్దని ఆమె అన్నారు. తాను ఏదైనా అనుచిత ప్రవర్తనను, క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నప్పుడు, వాటిని కఠినంగా తిరస్కరిస్తానని తెలిపారు.

తన బోల్డ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, నేను నచ్చితే నచ్చింది అని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను అని జ్యోతి పేర్కొన్నారు. ఈ స్వభావం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయానని ఆమె అన్నారు. తన నిజాయితీ, సూటిదనానికి భయపడి కొందరు పాత్రలను వివరించడానికి కూడా వెనుకాడతారని ఆమె తెలిపారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిలు, మీరు మీ కోసం నిలబడకపోతే, ప్రజలు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ధైర్యంగా, బలంగా ఉండాలి అని ఆమె అన్ని అమ్మాయిలకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా జ్యోతి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ, ఆమె తన మెడలో ఉన్న “ఈవిల్ ఐ” లాకెట్ల గురించి, అలాగే థాయ్‌లాండ్‌లో వేయించుకున్న తన టాటూ గురించి కూడా జ్యోతి ప్రస్తావించారు. ఇది ఒక సీతాకోకచిలుక అలాగే పువ్వు డిజైన్‌తో కూడిన టాటూ అని, తొలుత ఫ్యాషన్ కోసం వేయించుకున్నప్పటికీ, తరువాత దానికి రంగుల, విభిన్న జీవితం,   స్వేచ్ఛగా ఎగిరే స్వభావం  వంటి అర్థాలను తాను కనుగొన్నానని తెలిపారు జ్యోతి. ఈ టాటూ “కెవ్వు కేక” సినిమా సమయంలో వేయించుకున్నానని తెలిపారు జ్యోతి. అదేవిధంగా జ్యోతి తాను సింగిల్ మదర్‌నని, తనకు ఒక కుమారుడు ఉన్నాడని తెలిపారు. గత అనుభవాల వల్ల ప్రేమను నమ్మడానికి తాను ప్రస్తుతం సిద్ధంగా లేనని చెప్పారు. ఈ దశలో ప్రేమను నమ్మడానికి ధైర్యం సరిపోదు. అన్ని దెబ్బలు తిని వచ్చినప్పుడు, ఈసారి వచ్చేవాడు మంచివాడైనా కూడా వాడిని నమ్మే అంత ధైర్యం ఉండదు. కానీ ఇది ఎదుటి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది” అని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us