Nara Lokesh: స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎం​కు నారా లోకేశ్ లేఖ

సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని సూచించారు.

Nara Lokesh: స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎం​కు నారా లోకేశ్ లేఖ
Lokesh Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 17, 2022 | 2:48 PM

AP Schools: ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతోంది. సంక్రాంతి తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సెలవులు అనంతరం ఏపీలో స్కూల్స్ రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుత  పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు.  15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్న లోకేశ్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని సూచించారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు.

ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పేరెంట్స్ ను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్​కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

లోకేశ్ ట్వీట్…

Also Read: కరోనా బారిన పడ్డ నారా లోకేశ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో టీడీపీ యువనేత

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే