బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్‌ను హడలెత్తించే వంటింటి రాణి..

21 March 2026

TV9 Telugu

TV9 Telugu

స్వీట్లు, టీ లాంటి వాటిల్లో రుచికోసం, భోజనం తరవాత మౌత్‌ ఫ్రెష్‌నర్‌లానూ యాలకులను వాడుతుంటాం. అయితే వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

కప్పు నీటిలో ఒక యాలక్కాయను వేసుకుని మరిగించండి. ఆ తరవాత దాన్ని నెమ్మదిగా చప్పరిస్తూ తాగండి. దీన్లోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి

TV9 Telugu

పొట్టలో ఇన్‌ఫెక్షన్లనూ దూరం చేస్తాయి. ఇక, నల్ల యాలకుల్లోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్‌లను విడుదలచేసి గ్యాస్, అజీర్తిలను తగ్గిస్తాయి

TV9 Telugu

రోజుకొక యాలక్కాయను నమలడం వల్ల నోటి ఆరోగ్యమూ బావుంటుంది. రక్తంలో బీపీ, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయులు నియంత్రించడంతోపాటు, బరువూ అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

శరీరంలో అధికంగా ఉండే నీటినీ, టాక్సిన్లనూ బయటకు పంపిస్తుంది. కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులనూ తగ్గిస్తుంది

TV9 Telugu

కాబట్టి, యాలకుల వాడకం వల్ల మనకు తెలియకుండానే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టేయొచ్చు. యాలకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల పీరియడ్స్‌ నొప్పులు, పీఎంఎస్‌ లక్షణాలు తగ్గుతాయి

TV9 Telugu

హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయివి. గర్భధారణ సమయంలో మార్నింగ్‌ సిక్‌నెస్‌నీ తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి

TV9 Telugu

ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరిచి, శ్వాసకోస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. యాలకుల్లో ఉండే ఔషధగుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. వీటిని తీసుకుంటే నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ఇవి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి