బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. మూడేళ్ల ఎఫ్డీలపై పన్ను మినహాయింపు అవకాశం..!

Budget 2022: ఫిబ్రవరి 1న విడుదల కానున్న యూనియన్ బడ్జెట్ 2022 కి ముందు బ్యాంకులు ప్రత్యేక డిమాండ్‌ను లేవనెత్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్

బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. మూడేళ్ల ఎఫ్డీలపై పన్ను మినహాయింపు అవకాశం..!
Cash Deposit
Follow us
uppula Raju

|

Updated on: Jan 17, 2022 | 9:52 PM

Budget 2022: ఫిబ్రవరి 1న విడుదల కానున్న యూనియన్ బడ్జెట్ 2022 కి ముందు బ్యాంకులు ప్రత్యేక డిమాండ్‌ను లేవనెత్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వ్యవధిని మూడేళ్లకు తగ్గించాలని తద్వారా ఎక్కువ మంది పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారని బ్యాంకుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. మ్యూచువల్ ఫండ్‌లకు లింక్ చేసిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS)లో పన్ను మినహాయింపునకు సంబంధించి ఇదే విధమైన నియమం వర్తిస్తుంది. బ్యాంకుల ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే FD లాక్ ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.

ప్రస్తుతం ఒక FD మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలంటే అతను 5 సంవత్సరాల FDలో పెట్టుబడి పెట్టాలి. 5 సంవత్సరాల FDకి పన్ను ఆదా హోదా ఉంది. అంటే మీరు FDపై పన్ను ఆదా చేయాలనుకుంటే 5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. 5 సంవత్సరాల కాలాన్ని 3 సంవత్సరాలకు తగ్గించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. ఇది అమలైతే 3 సంవత్సరాల పన్ను ఆదా FD ప్రారంభమవుతుంది.

సెక్షన్ 80C ప్రయోజనం

ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందాలంటే 5 సంవత్సరాల పాటు పన్ను ఆదా చేసే FDలలో పెట్టుబడి పెట్టాలి. సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో బీమా ప్రీమియం కూడా వస్తుంది PPF పెట్టుబడికి ఇదే నియమం వర్తిస్తుంది. అయితే ఎఫ్‌డి 5 సంవత్సరాల కాలపరిమితిని 3 సంవత్సరాలకు తగ్గించాలని బ్యాంకులు డిమాండ్‌ చేస్తున్నాయి.

IBA సూచన

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ లేదా IBA బడ్జెట్‌కు ముందు ప్రభుత్వానికి తన సూచనను అందించింది. మార్కెట్‌లో అనేక పథకాలు ఉన్నాయి వీటిలో ELSS బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పథకాలలో కస్టమర్‌లు పన్ను ఆదా ప్రయోజనం పొందుతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కారణంగా తక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి. దాని లాక్-ఇన్ వ్యవధిని 3 సంవత్సరాలకు తగ్గించినట్లయితే అది డిపాజిటర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాంకులలో నిధులు పెరుగుతాయి. ప్రజలు మరిన్ని బ్యాంకుల ఎఫ్‌డిలలో డబ్బును డిపాజిట్ చేస్తారు. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.

Fashion Tips: చలికాలంలో స్లిమ్‌గా కనిపించాలంటే ఈ సింపుల్‌ ట్రిక్స్‌ తెలుసుకోండి..

మూడేళ్లలో 3 రెట్లు రెమ్యునరేషన్ పెంచేశాడు.. 7 కోట్ల నుంచి 21 కోట్లు..

పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. VPF ద్వారా అధిక రాబడి.. ఇంకా పన్నుమినహాయింపు