Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fashion Tips: చలికాలంలో స్లిమ్‌గా కనిపించాలంటే ఈ సింపుల్‌ ట్రిక్స్‌ తెలుసుకోండి..

Fashion Tips: వింటర్ సీజన్‌లో దుస్తుల విషయంలో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్ని దుస్తులు ధరించడం వల్ల లావుగా కనిపిస్తారు.

Fashion Tips: చలికాలంలో స్లిమ్‌గా కనిపించాలంటే ఈ సింపుల్‌ ట్రిక్స్‌ తెలుసుకోండి..
Fashion
Follow us
uppula Raju

|

Updated on: Jan 17, 2022 | 9:01 PM

Fashion Tips: వింటర్ సీజన్‌లో దుస్తుల విషయంలో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్ని దుస్తులు ధరించడం వల్ల లావుగా కనిపిస్తారు. దీంతో లోలోపల చాలా మదనపడుతుంటారు. చెప్పాలంటే కొంచెం లావుగా ఉన్న అమ్మాయిలైతే మరింత లావుగా కనిపిస్తారు. వీరు ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతారు. కానీ చలికాలంలో మందమైన దుస్తులను ధరించకుంటే చలి నుంచి శరీరాన్ని కాపాడుకోలేం. కానీ కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే చలికాలంలో కూడా స్లిమ్‌గా కనిపించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

శరీరానికి సరిపోయే దుస్తులు ధరించండి

మీరు అధిక బరువు, లావుగా ఉన్నట్లయితే మీరు ఎల్లప్పుడూ వదులుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం మంచిది. చలికాలంలో దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల లావుగా, ఎత్తు తక్కువగా కనిపిస్తారు. అందుకే మీకు సరిగ్గా సరిపోయే దుస్తులను ఎంచుకోండి. అప్పుడు ఎక్కువ లావుగా కనిపించరు. చూడటానికి స్టైలిష్‌గా ఉంటారు.

సన్నని ఫాబ్రిక్ కొనండి

లావుగా ఉన్నవారు శీతాకాలంలో దుస్తులను తెలివిగా కొనుగోలు చేయాలి. వెల్వెట్, లెదర్, బ్రోకేడ్, అంగోరా, టఫెటా, శాటిన్ వంటి మందపాటి ఫ్యాబ్రిక్ దుస్తులు ధరిస్తే మీరు కచ్చితంగా లావుగా కనిపిస్తారు. బదులుగా సన్నని ఫాబ్రిక్ దుస్తులను ధరించండి. మీరు డెనిమ్, సిల్క్ ఎంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని స్లిమ్‌గా కనిపించడంలో సహాయపడుతుంది.

దుస్తుల రంగు ప్రభావం

దుస్తుల రంగు కూడా లావుగా లేదా సన్నగా కనిపించేలా చేయడంలో ప్రభావం చూపుతుంది. ముదురు రంగు దుస్తులు మిమ్మల్ని స్లిమ్‌గా, తేలికపాటి దుస్తులు చాలా లావుగా కనిపించేలా చేస్తాయి. అందుకే మీరు ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవాలి. చార్కోల్ గ్రే, డీప్ ప్లం, చాక్లెట్ బ్రౌన్, రెడ్, ఎల్లో, డార్క్ క్రాన్బెర్రీ రంగులను ఎంచుకోవచ్చు. అలాగే నలుపు రంగు ఎల్లప్పుడూ లావుగా ఉన్నవారికి ఖచ్చితంగా సరిపోతుంది.

మూడేళ్లలో 3 రెట్లు రెమ్యునరేషన్ పెంచేశాడు.. 7 కోట్ల నుంచి 21 కోట్లు.. ఎవరో తెలుసా..?

జన్‌ధన్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి నుంచి ఆ సౌకర్యాలు లభించే అవకాశం..?

Kia Carence: మొదటిరోజే 7వేలకు పైగా బుకింగ్‌లు.. ఈ కంపెనీ కార్లకి గట్టి పోటీ..?

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ సదుపాయం 50 రోజులు ఉచితం!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ సదుపాయం 50 రోజులు ఉచితం!
శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్ల సునామీ.. 5 రోజుల్లోనే
బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్ల సునామీ.. 5 రోజుల్లోనే
KKRపై పగ తీర్చుకోవాలని వచ్చి రెండో బంతికే డకౌట్!
KKRపై పగ తీర్చుకోవాలని వచ్చి రెండో బంతికే డకౌట్!
దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలరు
దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలరు
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి వేడుకలు షూరు..
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి వేడుకలు షూరు..
సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!
సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!
24 గంటల్లోనే బంగారం ధర రికార్డ్‌.. లక్షకు చేరువలో పసిడి పరుగులు
24 గంటల్లోనే బంగారం ధర రికార్డ్‌.. లక్షకు చేరువలో పసిడి పరుగులు
విదేశాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవం..!
విదేశాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవం..!
థియేటర్‏లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ హీరోల ఫ్యాన్స్..
థియేటర్‏లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ హీరోల ఫ్యాన్స్..