Kia Carence: మొదటిరోజే 7వేలకు పైగా బుకింగ్‌లు.. ఈ కంపెనీ కార్లకి గట్టి పోటీ..?
Kia Carence: Kia Carens జనవరి 14న ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించింది.
Kia Carence: Kia Carens జనవరి 14న ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించింది. కియా కంపెనీకి చెందిన కారెన్స్ ప్రీమియం క్లాస్ MPV కారు. దీనిని కేవలం 25 వేల రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కియా తన గ్లోబల్ లాంచ్ సందర్భంగా భారతదేశం కోసం ఈ కారును విడుదల చేసింది. భారతదేశంలో కియాకి ఇది నాలుగో కారు. ఇంతకుముందు కంపెనీ కియా సెల్టోస్ , కియా కార్నివాల్, కియా సోనెట్ మార్కెట్లో ఉన్నాయి.
Kia Carens ధర
Kia Carence అనేక మంచి ఫీచర్లతో అద్భుతంగా ఉంది. అయితే ఇప్పటివరకు కంపెనీ దాని ధరను వెల్లడించలేదు. భారతదేశంలో ఈ కారు మారుతి సుజుకి XL వంటి కార్లతో పోటీపడుతుంది. కారు ప్రీమియం ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌లతో కూడిన ట్రిమ్ స్థాయిలతో వస్తుంది. మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
కియా కారెన్స్ ఫీచర్స్
ఈ కారుల వినియోగదారులకు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. ఇది టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో రైడర్లు స్వచ్ఛమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను పొందుతారు. ఇది బ్యాక్టీరియా రక్షణతో నాక్ చేస్తుంది. ఇందులో రెండో వరుసలో వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్, స్కై లైట్ సన్‌రూఫ్ ఇచ్చారు.Kia Carence స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4T GDI పెట్రోల్ వేరియంట్, 1.5CRDi VGT డీజిల్ అనే మూడు ఎంపికలలో అందుబాటులో ఉంది. అలాగే ఇది మూడు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది. అవి 6MT, 7DCT, 6AT. ఈ వాహనంలో 7 సీట్ల ఎంపిక అమర్చారు. 6 సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
కియా కారెన్స్ ఈ కార్లతో పోటీ
హ్యుందాయ్, హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎక్స్‌ఎల్6, టయోటా క్రిస్టా వంటి బ్రాండ్‌లతో కియా కేరెన్స్ పోటీపడనుంది. హ్యుందాయ్ కారులో ఆరు, ఏడు సీట్ల ఎంపిక ఉంది. అలాగే టయోటా క్రిస్టా కారులో 1462 cc ఇంజన్ ఇచ్చారు. ఇన్నోవా అత్యధికంగా అమ్ముడవుతున్న MPVలలో ఒకటి. కంపెనీ దీనిని మొదట 2005 సంవత్సరంలో ప్రారంభించింది అప్పటి నుంచి దీనిని చాలాసార్లు అప్‌గ్రేడ్ చేశారు.
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో