తక్కువ ధరకే కారు కొనే అవకాశం.. ఈ మోడల్స్‌పై లక్షా ముప్పై వేల తగ్గింపు..

తక్కువ ధరకే కారు కొనే అవకాశం.. ఈ మోడల్స్‌పై లక్షా ముప్పై వేల తగ్గింపు..
Renault Car

Renault Offer: తక్కువ ధరలో కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. రెనాల్ట్ ఇండియా తన కార్లపై జనవరి 2022లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.

uppula Raju

|

Jan 17, 2022 | 6:35 PM

Renault Offer: తక్కువ ధరలో కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. రెనాల్ట్ ఇండియా తన కార్లపై జనవరి 2022లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. వివిధ మోడళ్లపై కస్టమర్లు ఏకంగా రూ.1.30 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. రెనాల్ట్ గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో మొత్తం 6,130 యూనిట్లను విక్రయించింది. భారతదేశంలో ఈ కంపెనీ నాలుగు మోడళ్లని విక్రయిస్తుంది. క్విడ్, ట్రైబర్, కిగర్, డస్టర్. కొత్త సంవత్సరంలో రెనాల్ట్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్లు, డీల్‌లను అందిస్తోంది. వాస్తవానికి కంపెనీ తాజా ఆఫర్ రెనాల్ట్ కిగర్ మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది. రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ కిగర్, రెనాల్ట్ డస్టర్ వంటి బెస్ట్ సెల్లింగ్ మోడళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ఆఫర్‌లలో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనం, లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. రెనాల్ట్ కార్ల బుకింగ్ కొనుగోలు కోసం ఈ ఆఫర్ 31 జనవరి 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

1. రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ డస్టర్ పై రూ. 1.30 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం ఉంది. ఇది రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. రూరల్ డిస్కౌంట్ రూ.15,000 వరకు ఉంది. సర్పంచ్, రైతులు, గ్రామ పంచాయతీ సభ్యులకు గ్రామీణ మినహాయింపు వర్తిస్తుంది. రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర రూ.9.86 లక్షలు.

2. రెనాల్ట్ ట్రైబర్

Renault Triber 2021 మోడల్‌పై రూ. 40,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.5.69 లక్షలు. మోడల్ ఇయర్ 2022 మోడల్స్‌పై రూ. 30,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇందులో రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది.

3. రెనాల్ట్ కీగర్

Renault కాంపాక్ట్ SUV, Kiger రూ.10,000 లాయల్టీ ప్రయోజనం, రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపుతో వస్తుంది. దీనిపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. ఈ కారు ప్రారంభ ధర రూ.5.79 లక్షలు ఎక్స్-షోరూమ్.

4. రెనాల్ట్ క్విడ్

Renault Kwid 2021 మోడల్‌పై రూ. 35,000 తగ్గింపు ఉంది. ఈ కారుపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ 1.0 లీటర్ మోడల్‌పై రూ.15,000, 0.8 లీటర్ మోడల్‌పై రూ.10,000 లభిస్తోంది. ఇది కాకుండా ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ.10,000 కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉంది. Renault Kwid 2022 మోడల్‌పై రూ. 30,000 తగ్గింపు ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.5,000 నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు, రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంది. కారు ప్రారంభ ధర రూ.4.24 లక్షలుగా ఉంది.

Kia Carence: మొదటిరోజే 7వేలకు పైగా బుకింగ్‌లు.. ఈ కంపెనీ కార్లకి గట్టి పోటీ..?

Aloevera: అలోవెరా జెల్‌ అద్భుత ప్రయోజనాలు.. బరువు తగ్గించడంలో సూపర్..

Travel: ఇండియాలో నిషేధించిన పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu