Aloevera: అలోవెరా జెల్‌ అద్భుత ప్రయోజనాలు.. బరువు తగ్గించడంలో సూపర్..

Aloevera: అలోవెరా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక సంవత్సరాలుగా ప్రజాదరణ పొందింది. అలోవెరాలో ఉన్న డిటాక్సిఫైయింగ్ గుణాల కారణంగా

Aloevera: అలోవెరా జెల్‌ అద్భుత ప్రయోజనాలు.. బరువు తగ్గించడంలో సూపర్..
Aloevera
Follow us
uppula Raju

|

Updated on: Jan 17, 2022 | 5:56 PM

Aloevera: అలోవెరా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక సంవత్సరాలుగా ప్రజాదరణ పొందింది. అలోవెరాలో ఉన్న డిటాక్సిఫైయింగ్ గుణాల కారణంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మృదు చర్మం, ఇతర ఆరోగ్య సమస్యలను వదిలించుకోవడానికి కలబందను ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే చాలా మంది అలోవెరాను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో కలబంద నుంచి తయారైన జ్యూస్‌లు ఉంటాయి. ఈ జ్యూస్‌లని డైట్‌లో ఏ విధంగా చేర్చాలో తెలుసుకుందాం.

1. భోజనానికి ముందు కలబంద రసం

బరువు తగ్గడానికి మీరు ప్రతిరోజూ భోజనానికి 14 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.

2. కలబందను వేడి నీళ్లలో కలుపుకుని తాగవచ్చు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలబంద రసం కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. కలబంద గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఇది ఉత్తమ మార్గం.

3. కలబందను తేనెతో కలిపి తినవచ్చు

బరువు తగ్గడానికి కలబంద రసాన్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం అలోవెరాలో కొన్ని చుక్కల తేనె కలపాలి. ఇది దాని రుచిని మరింత మెరుగ్గా చేస్తుంది.

4. నిమ్మకాయతో కలబంద రసం

ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. దానికి ఒక టీస్పూన్ అలోవెరా జెల్ కలపాలి. ఈ ద్రావణాన్ని గిన్నెలో పోసి వేడి చేయాలి. అందులో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగాలి. ఈ జ్యూస్‌ని ప్రతిరోజూ ఉదయం పరగడుపుతో తాగాలి. జ్యూస్ తాగిన గంట వరకు ఏమీ తినకూడదు. కలబందలోని డిటాక్సిఫైయింగ్ గుణాలు శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది పేగులని శుభ్రపరుస్తుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5. ఆరెంజ్, స్ట్రాబెర్రీ, అలోవెరా

నారింజ, కలబంద, స్ట్రాబెర్రీలను కలిపి బరువు తగ్గించే గొప్ప యాంటీఆక్సిడెంట్ పానీయాన్ని తయారు చేయవచ్చు. దీనిని తయారుచేయడానికి నారింజ రసాన్ని పిండి, అందులో మూడు, నాలుగు స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కలబంద రసాన్ని కలపాలి. వీటన్నింటిని జ్యూస్‌గా పట్టి ప్రతిరోజు తాగితే బరువు తగ్గుతారు.

Travel: ఇండియాలో నిషేధించిన పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు..

Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?

Health News: ఈ మూడు జ్యూస్‌లు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి..! అవేంటంటే..?

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవేంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవేంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్