మూడేళ్లలో 3 రెట్లు రెమ్యునరేషన్ పెంచేశాడు.. 7 కోట్ల నుంచి 21 కోట్లు..

మూడేళ్లలో 3 రెట్లు రెమ్యునరేషన్ పెంచేశాడు.. 7 కోట్ల నుంచి 21 కోట్లు..
John Abraham

John Abraham: బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన నటుల్లో జాన్ అబ్రహం ఒకరు. ప్రస్తుతం జాన్ అద్భుతమైన యాక్షన్ చిత్రాలను చేస్తున్నాడు. అభిమానులు

uppula Raju

|

Jan 17, 2022 | 8:39 PM

John Abraham: బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన నటుల్లో జాన్ అబ్రహం ఒకరు. ప్రస్తుతం జాన్ అద్భుతమైన యాక్షన్ చిత్రాలను చేస్తున్నాడు. అభిమానులు అతడి స్టైల్‌ని ఎంతో ఇష్టపడుతారు. అయితే జాన్‌ క్రమంగా తన రెమ్యునరేషన్‌ పెంచేశాడు. సత్యమేవ జయతే, బాట్లా హౌస్ నుంచి జాన్ తన ఫీజు పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. జాన్ తన రాబోయే చిత్రం ఏక్ విలన్ రిటర్న్స్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేశాడు. అయినా కూడా మేకర్స్‌ ఈ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. నివేదికల ప్రకారం మోహిత్ సూరి చిత్రానికి జాన్ అబ్రహం 21 కోట్లకు సంతకం చేశాడని సమాచారం.

జాన్ మార్కెట్ ధరలు మూడేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. బాట్లా హౌస్ సమయంలో జాన్ సత్యమేవ జయతే కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ పొందాడు. తర్వాత సత్యమేవ జయతే 2లో బాట్లా హౌస్ కంటే ఎక్కువ ఫీజు తీసుకున్నాడు. పఠాన్ చిత్రంలో పని చేయడానికి జాన్ రూ. 20 కోట్లకు సంతకం చేశాడని సమాచారం. ఇప్పుడు అతను ఏక్ విలన్ రిటర్న్స్ కోసం రూ. 21 కోట్లు తీసుకుంటున్నాడు. అలా గత 3 ఏళ్లలో జాన్ అబ్రహం రెమ్యునరేషన్ 7 కోట్ల నుంచి 21 కోట్లకు చేరుకుంది. కాబట్టి 3 సంవత్సరాలలో జాన్ ఫీజు మూడు రెట్లు పెరిగింది.

ఏక్ విలన్ రిటర్న్ చిత్రంలో జాన్‌తో పాటు రితీష్ దేశ్‌ముఖ్, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మోహిత్ సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అతను సిద్ధార్థ్ మల్హోత్రా, రితీష్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో ఏక్ విలన్‌కు దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏడాది జులైలో బక్రీద్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. అయితే ఏక్‌ విలన్‌ రిటర్న్‌ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ నటి విలన్ పాత్రను పోషిస్తుందని తెలిసింది. ఆ నటి ఎవరనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఏక్ విలన్ రిటర్న్స్‌ను భూషణ్ కుమార్ టి-సిరీస్, ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.

పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. VPF ద్వారా అధిక రాబడి.. ఇంకా పన్నుమినహాయింపు

జన్‌ధన్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి నుంచి ఆ సౌకర్యాలు లభించే అవకాశం..?

తక్కువ ధరకే కారు కొనే అవకాశం.. ఈ మోడల్స్‌పై లక్షా ముప్పై వేల తగ్గింపు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu