Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: నార్త్ ఆడియన్స్‏కు మరో ట్రీట్.. బాలీవుడ్‏లోకి రంగస్థలం.. విడుదల ఎప్పుడంటే..

ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోయిది. ఇప్పుడు సినిమా అంటే

Ram Charan: నార్త్ ఆడియన్స్‏కు మరో ట్రీట్.. బాలీవుడ్‏లోకి రంగస్థలం.. విడుదల ఎప్పుడంటే..
Rangastalam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2022 | 8:28 AM

ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోయిది. ఇప్పుడు సినిమా అంటే హాలీవుడ్.. బాలీవుడ్.. ఇలా ఒక్కటేమిటీ.. భాషతో సంబంధం లేకుండా తెలుగు చిత్రాల వైపు చూస్తున్నాయి. ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ మూవీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా డైరెక్టర్‏గా జక్కన స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక రాజమౌళి తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజులు అవుతున్న థియేటర్ల వద్ధ పుష్ప క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

సుకుమార్ తెరకెక్కించిన పుష్ప.. కేవలం దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఊరమాస్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. కేవలం పుష్ప మూవీ మాత్రమే కాకుండా.. అందులోని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఖండాంతరాలను దాడి మరీ పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు సినిమా మరింత చేరువవుతుంది.

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా జనవరి 26న హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో తెలుగు మూవీ కూడా హిందీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మమా మనీష్ షాహా తెలిపారు. జనవరి 26న అల వైకుంఠపురంలో విడుదల చేస్తామని.. ఆ తర్వాత ఫిబ్రవరిలో రంగస్థలం రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఇష్టపడుతున్నారని.. కలెక్షన్స్ కూడా మంచిగా వస్తున్నాయని తెలిపారు. ఇవే కాకుండా.. తమిళ్ స్టార్ హీరోస్ విజయ్ నటించిన మెర్సల్, అజిత్ నటించిన విశ్వాసం సినిమాలు కూడా హిందీలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..