AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Radhe Shyam: ప్ర‌భాస్ హీరోగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించారు మేక‌ర్స్‌. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..
Narender Vaitla
|

Updated on: Jan 17, 2022 | 4:00 PM

Share

Radhe Shyam: ప్ర‌భాస్ (Prabhas) హీరోగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం రాధే శ్యామ్‌ (RadheShyam). రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించారు మేక‌ర్స్‌. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డిన త‌ర్వాత రాధేశ్యామ్ విడుద‌ల‌ను వాయిదా వేయ‌మ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ప్పటికీ.. చివ‌రి క్ష‌ణంలో తాము కూడా చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు ముందుకు తీసురాలేక‌పోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త విడుద‌ల తేదీపై చిత్ర యూనిట్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. తాజాగా రాధేశ్యామ్ విడుద‌ల తేదీ ఇదేనంటూ ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను మార్చ్ 17న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మార్చి నాటికి క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్న నేప‌థ్యంలో రాధేశ్యామ్‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక ఇప్ప‌టికే వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ కూడా మార్చ్‌లోనే విడుద‌ల చేయ‌డానికి జ‌క్క‌న్న ప్లాన్ వేస్తున్నార‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే ఒకే నెల‌లో సినీ ల‌వ‌ర్స్‌కు డ‌బుల్ ట్రీట్ అంద‌నుంద‌న్న‌మాట‌.

Also Read: Amazon Hyderabad: హైద‌రాబాద్ అమెజాన్ క్యాంప‌స్ ఎలా ఉందో చూశారా.? సౌక‌ర్యాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఉడకబెట్టిన వేరుశనగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

South Africa: కోవిడ్‌-19తో జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. దక్షిణాఫ్రికా వితండవాదం.. లాక్‌డౌన్‌కు నో..!

Follow Us
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..