Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

తమిళ  స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకంచి అందరినీ ఆశ్చర్యానికి గురించేశాడు. 

Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..
Dhanush And Aishwarya
Follow us
Basha Shek

| Edited By: Phani CH

Updated on: Jan 18, 2022 | 1:28 PM

తమిళ  స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  ఐశ్వర్య మరెవరో కాదు  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురే . వీరిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  ఈ క్రమంలో తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు ధనుష్. ‘ మేం  18  సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ,  శ్రేయోభిలాషులుగా .. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం.  కాని ఈరోజు  ఐశ్వర్య ,  నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి .  ఇన్ని రోజులు మాపై ఎంతటి ప్రేమాభిమానాలు చూపారో ఇప్పుడు కూడా మాకు అవసరమైన గోప్యతను అందించండి . ఓం నమశివాయ!  ఇట్లు ప్రేమతో మీ ధనుష్’  అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ధనుష్.

18 ఏళ్ల ప్రయాణానికి ముగింపు..

కోలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. సినిమా, సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ  తన నటనతో ఎంతోమంది అభిమానులతో పాటు రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.  తెలుగులో కూడా అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా  ‘సార్ ‘ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.  అదేవిధంగా శేఖర్ కమ్ముల ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్పాడు.  ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. రజనీకాంత్ పెద్ద కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఓగుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. మొదట ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత డైరెక్టర్ గా తన అదృష్టం  పరీక్షించుకుంది.  తన భర్త ధనుష్, శ్రుతిహాసన్ లతో కలిసి ‘ 3’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచినా సినిమా మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.  ఆతర్వాత ‘వాయ్ రాజా వాయ్’ అనే సినిమాతో పాటు ‘సినిమా వేరన్’ అనే ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. కాగా వీరిద్దరూ 2004 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులున్నారు.

Also Read:

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..