AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: స్పెషల్ సాంగ్ కు ‘ఊ’ అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. అంతే కాదు

పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మూవీలో సామ్ స్పెషల్ సాంగ్ చేస్తుందన్నప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా షేకయిపోయింది.

Samantha: స్పెషల్ సాంగ్ కు 'ఊ' అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. అంతే కాదు
Samantha
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2022 | 9:45 PM

Share

పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ నటనకు, సుకుమార్ టేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దేవీ మ్యూజిక్, చంద్రబాస్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. కుమ్మేశారు అంతే. ఇక ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. ఊహూ అంటావా మామ’ గురించి. సామ్ స్పెషల్ సాంగ్ చేస్తుందన్నప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా షేకయిపోయింది. ఇక థియేటర్లు అయితే ఈ పాట వస్తున్నప్పుడు దద్దరిల్లిపోయాయి. సింగర్ ఇంద్రావతి చౌహాన్ కూడా మత్తెక్కేలా పాట పాడింది. ఇక సమంత బ్యూటీకి, డ్యాన్స్ కు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. కేవలం సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా సామ్ కు ఫిదా అయ్యారు. అయితే ఈ పాటకు సమంతను ఒప్పించడానికి మేకర్స్ చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా తన స్నేహం కారణంగా హీరో అల్లు అర్జున్ పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అందుకే మూడు నిమిషాల పాట కోసం ఆమెకు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. ఈ విషయం తెలిసి బాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇక ‘ఊ అంటావా.. ఊహూ అంటావా’ పాట లిరికల్ వీడియో ఏకంగా 139 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన వీడియో సాంగ్ సైతం దుమ్మురేపుతోంది. కాగా ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే.. పుష్ప ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ లోని మరో ‘స్పెషల్’ సాంగ్ కోసం మేకర్స్ సమంతనే తీసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. అతే జరిగితే ఫ్యాన్స్ కు మరోసారి ఐ ఫీస్ట్ ఉంటుంది.

Also Read: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మద్యం షాపుల పనివేళలు పొడిగింపు

Follow Us
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!