Ibrahim Ashk: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హిందీ సినీ గీత రచయిత ఇబ్రహీం మృతి.. నేడు అంత్యక్రియలు..
Ibrahim Ashk Passed Away: చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మరో ప్రముఖ వ్యక్తిని బలితీసుకుంది. ప్రముఖ హిందీ సినీ గీత రచయిత..
Ibrahim Ashk Passed Away: చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మరో ప్రముఖ వ్యక్తిని బలితీసుకుంది. ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఇబ్రహీం ఆష్క్ (Ibrahim Ashk )70 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. 70 ఏళ్ల ఈ సంగీతకారుడు కరోనా బారిన పడి తుది శ్వాస విడిచారు. ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’ ఫేమ్ గీత రచయిత ముంబైలోని మెడిటెక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయాన్ని ఇబ్రహీం కుమార్తె ముసాఫా ఖాన్ చెప్పారు. ముసాఫా తన తండ్రికి శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల్లో ఇబ్రహీంకి కోవిడ్ -19 తో పాటు న్యుమోనియా సోకినట్లు తేలింది. వీటి ప్రభావం ఊపిరితిత్తులపై పడింది. అంతేకాదు ఇబ్రహీం ఎప్పటి నుంచో గుండెకు సంబందించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.
శనివారం ఉదయం దగ్గు పెరిగిందని.. రక్తం వాంతులు అయ్యాయని ముసాఫా చెప్పారు. వెంటనే తము తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. హార్ట్ పేషెంట్ కావడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు వైద్యులు. అయితే ఇబ్రహీం ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నమని కుమార్తె తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో జన్మించిన ఇబ్రహీం అష్క్ అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు. అంతేకాదు ఇబ్రహీం మంచి కవి కూడా. కవిత్వం , కవితలు కూడా వ్రాస్తాడు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన అతను డైలీ ఇండోర్ సమాచార్‌తో సహా అనేక పత్రికలకు కూడా పనిచేశారు. ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’, ‘ఇధర్ చలా మే ఉధర్ చలా’ .. ‘ఆప్ ముఝే ఐ అచ్చే లగ్నా లగే, క్రిష్’, ‘వెల్ కమ్’, ‘ఐత్‌బార్’, ‘జన్షీన్’, ‘బ్లాక్ అండ్ వైట్’ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలను అందించారు. అతనికి భార్య , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Also Read: