Happy Birthday: ఒకప్పుడు టెలిఫోన్ బూత్‌లో చేసిన యువకుడు.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్, విజయ్ సేతుపతి పుట్టిన రోజు నేడు..

Happy Birthday Vijay Setupathi : విజయ్ సేతుపతి(Vijay Setupathi )కోలీవుడ్ లో స్టార్ హీరో.. డబ్బింగ్ సినిమాతోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన..

Happy Birthday: ఒకప్పుడు టెలిఫోన్ బూత్‌లో చేసిన యువకుడు.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్, విజయ్ సేతుపతి పుట్టిన రోజు నేడు..
Vijay Sethupathi
Follow us

|

Updated on: Jan 16, 2022 | 8:52 AM

Happy Birthday Vijay Setupathi : విజయ్ సేతుపతి(Vijay Setupathi )కోలీవుడ్ లో స్టార్ హీరో.. డబ్బింగ్ సినిమాతోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన (Uppena) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతు పతి. నేడు విజయ్ పుట్టిన రోజు. అతని పూర్తి పేరు విజయ్ గురునాథ్ సేతుపతి కాళీమాతు. విజయ్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, మాటల రచయిత, సంభాషణల రచయిత. అనేక తమిళ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేశారు. నటుడుగా వెండి తెరపై విజయ్ సేతుపతి అడుగు పెట్టడానికి ముందు అకౌంటెంట్ గా ఉద్యోగం చేసేవారు. నటనమీద ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి అడుగు పెట్టార. సినీ కెరీర్ ను సహాయ నటుడిగా ప్రారంభించారు. అయితే మంచి ఫేం ని తెచ్చింది సినిమా మాత్రం 2010లో రిలీజైన ‘తెన్మార్కు పరువుకటారు’ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. 2012లో విడుదలైన ‘సుందరపాండియన్‌’ చిత్రంలో కూడా విజయ్‌ విలన్‌గా నటించారు. విజయ్ ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో పనిచేశాడు.

తమిళనాడులో జన్మించిన విజయ్

విజయ్ సేతుపతి 1978 జనవరి 16న తమిళనాడులోని రాజపాళయంలో జన్మించారు. చెన్నైలోని కోడంబాక్కమ్‌లోని MGR హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విజయ్ సేతుపతి తన విద్య అభ్యసించాడు, అనంతరం చెన్నైలోని ధనరాజ్ బాద్ జైన్ కాలేజీలోబికాం డిగ్రీ పట్టాను అందుకున్నారు. విజయ్ సేతుపతి కి 2003లో వివాహమైంది. భార్య పేరు జెస్సీ సేతుపతి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూతురు శ్రీజ, కొడుకు సూర్య.

విజయ్ తన పాకెట్ మనీ సంపాదించడానికి సేల్స్‌మెన్, హోటల్ క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా కూడా పనిచేశాడు. కాలేజీ చివర్లో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరాడు. విజయ్‌కి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి డబ్బు సంపాదన కోసం దుబాయ్ కూడా వెళ్ళాడు.

ప్రేమ పెళ్లి కెరిర్:

తరువాత, జెస్సీ అనే యువతితో ఆన్‌లైన్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అయితే దుబాయ్‌లో తన ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న విజయ్ తిరిగి భారతదేశానికి వచ్చారు. తనస్నేహితుడితో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. అతను ఒక మార్కెటింగ్ కంపెనీలో చేరాడు, అక్కడ విజయ్ దర్శకుడు బాబు మహేంద్రతో పరిచయం ఏర్పడింది. అప్పుడు విజయ్‌ ముఖం ఫోటోజెనిక్ నటుడుగా ప్రయత్నించు అంటూ మహేంద్ర పోత్సహించారు. దీంతో సినిమాల్లో నటించాలనే ఆసక్తిని మరింత పెంచుకున్నాడు విజయ్.

ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్

విజయ్ 2010లో చాలా షార్ట్ ఫిల్మ్‌లలో పనిచేశారు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. విజయ్ 2015లో వచ్చిన ‘ఆరెంజ్ మిఠాయి’ చిత్రానికి రచయిత , నిర్మాత. చాలా పాటలు కూడా స్వయంగా రాశారు. విజయ్ ‘విజయ్ సేతుపతి ప్రొడక్షన్’ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను కూడా ప్రారంభించారు.

Also Read:

 ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?