Bhama: హీరోయిన్ ఆత్మహత్యాయత్నం ?.. అసలు విషయం చెప్పిన నటి భామ..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. సామాన్యూలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం నెట్టింట్లో
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. సామాన్యూలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం నెట్టింట్లో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్స్ కు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా.. సెలబ్రెటీలు షేర్ చేసిన లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే హీరోయిన్స్ చిన్న పోరపాటు చేసిన వారిని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. వారి గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నవారిని కూడా అస్సలు వదలరు. సోషల్ మీడియాలో ఇప్పటికే కొందరు హీరోయిన్స్ గురించి రూమర్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళ నటి భామ ఆత్యహత్యాయత్నం చేసుకుందంటూ నెట్టింట్లో ప్రచారం జరిగింది.
ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నం చేసినందంటూ కథనాలు వెలువడ్డాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగ విచారిస్తుండడంతో భయాందోనలకు గురై ఇలాంటి చర్యకు పాల్పడిందంటూ సోషల్ మీడయాలో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై స్పందించింది నటి భామ. ఈ విషయంపై తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది భామ.. ” నాపై వస్తున్న ఆరోపణల్లో.. కథనాల్లో ఎలాంటి నిజం లేదు. నా గురించి ఎవరు ఆందోళన చెందొద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమాభీమానాలకు ధన్యవాదాలు.” అంటూ రాసుకోచ్చింది. డైరెక్టర్ లోహితదాస్ దర్శకత్వం వహించిన నైవేద్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భామ. 2020లో వ్యాపారవేత్త అరుణ్ ను పెళ్లిచేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పింది.
View this post on Instagram
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..