Samantha oo antava song: చచ్చిపోయా పో.. బేబీ పాటకు సమంత రియాక్షన్.. ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..

Samantha oo antava song: చచ్చిపోయా పో.. బేబీ పాటకు సమంత రియాక్షన్.. ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 16, 2022 | 9:25 AM

ఐకాన్‌ స్టార్‌ మొదటిసారి పూర్తి మాస్‌ పాత్రలో నటించిన చిత్రం 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య2' సినిమాల తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిందీ చిత్రం. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌17న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.



ఐకాన్‌ స్టార్‌ మొదటిసారి పూర్తి మాస్‌ పాత్రలో నటించిన చిత్రం ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ సినిమాల తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిందీ చిత్రం. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌17న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక సమంత స్పెషల్ సాంగ్‌ ఈ సినిమాకు మరో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ‘ఉ అంటావా మావ.. ఉహూ అంటావా మావ’ పాట మాస్‌ జనాలను బాగా ఆకట్టుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ పాటకు థియేటర్లలో మరింత అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. హస్కీ వాయిస్‌తో సాగే ఈ పాట సోషల్‌ మీడియాలో కూడా దూసుకుపోయింది. చాలామంది ఈ పాటను స్ఫూప్‌ చేశారు. తమదైన స్థాయిలో రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. తాజాగా ఓ చిన్నారి కూడా ఎంతో క్యూట్‌గా పాటను ఆలపించింది. చిట్టి పొట్టి మాటలతో పాటను హమ్‌ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమంత, దేవిశ్రీప్రసాద్‌ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ చిన్నారి పాటకు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోలో చిన్నారికి తల్లి నోట్‌బుక్‌లో ఉన్న ‘హు( Who)’ అనే పదం నేర్పుతూ ఉంటే పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉహూ అంటావా మావ’ అని పాడుతూ నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. చిన్నారి ఎక్స్‌ప్రెషన్లకు ముగ్ధురాలైన సామ్‌ ఈ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ‘డెడ్‌’ అంటూ మూడు లవ్‌ ఎమోజీలతో క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక ఈ పాటకు అద్భుతమైన బాణీలు సమకూర్చిన దేవిశ్రీప్రసాద్‌ కూడా చిన్నారి పాటను ‘డామ్‌ క్యూటీ..’ అని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. అనంతరం ఈ వీడియో పోస్ట్‌ చేసిన యూజర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ పాటను ప్రముఖ ఫోక్‌ సింగర్‌ మంగ్లీ సోదరి ఇంద్రావతి పాడిన సంగతి తెలిసిందే.

Published on: Jan 16, 2022 08:50 AM