Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Naga Chaitanya: నాగ‌చైత‌న్య‌, స‌మంతల విడాకుల వ్య‌వ‌హారం ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్వీట్ క‌పుల్ విడిపోవ‌డాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే తాము ఇద్ద‌రం ఇష్ట‌పూర్వ‌కంగానే...

Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 15, 2022 | 10:44 PM

Naga Chaitanya: నాగ‌చైత‌న్య‌, స‌మంతల విడాకుల వ్య‌వ‌హారం ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్వీట్ క‌పుల్ విడిపోవ‌డాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే తాము ఇద్ద‌రం ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం అని ఈ జంట అక్టోబ‌ర్ 2న మ‌త విడాకుల విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయ‌తే అప్ప‌టి నుంచి ఈ జంట ఎక్క‌డా త‌మ విడాకుల విష‌యం గురించి స్పందించింది లేదు. కాస్తో కూస్తో స‌మంత అప్పుడ‌ప్పుడు సోషల మీడియాలో పోస్ట్‌లు చేసిన‌ప్ప‌టికీ, చై మాత్రం ఒక్క‌సారి కూడా ఈ విష‌యంపై రెస్పాండ్ కాలేదు. అయితే తాజాగా బంగార్రాజు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాత్రం.. ఇద్ద‌రి సంతోషం కోస‌మే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆఫ్ ది రికార్డుగా చెప్పిన ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా స‌మంత గురించి చైత‌న్య మ‌రోసారి మాట్లాడారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘మీరు న‌టించిన సినిమాల్లోని హీరోయిన్స్‌ల‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో కుదిరింద‌ని’ అడిగిన ప్ర‌శ్న‌కు త‌డ‌ముకోకుండా.. వెంట‌నే స‌మంతోనే కుదిరింది అని చెప్పుకొచ్చాడు.

దీంతో అంతా షాక్‌కి గుర‌య్యారు. విడాకుల త‌ర్వాత కూడా త‌న బెస్ట్ పెయిర్ స‌మంతేన‌ని చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఎమోష‌న్ అవుతున్నారు. ఏం మాయ చేశావే సినిమాతో మొద‌లైన చై,సామ్‌ల జోడి.. ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మజిలి’, ‘మనం’ చిత్రాల వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఈ అన్ని సినిమాల్లో ఈ జంట‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

Also Read: Rashmi Gautam: సంక్రాంతి స్పెషల్.. బ్లూటాప్‌లో రష్మి గౌతమ్ పరువాల విందు

Virat Kohli: ఆ కారణంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా.. కీలక విషయాలు వెల్లడించిన విరాట్ కోహ్లీ..!

IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్.. కనకవర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధం.. వారెవరంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!