IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్.. కనకవర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధం.. వారెవరంటే?

2022 సంవత్సరానికి సంబంధించిన IPL మరింత ఉత్సాహంగా, సరదాగా సాగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు ఆడబోతున్నాయి. అదే సమయంలో, 2022 సీజన్‌లో అన్ని జట్ల రూపు రేఖలు మారనున్నాయి. 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది.

IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్.. కనకవర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధం.. వారెవరంటే?
Oldest Players In Ipl Mega Auction 2022
Follow us
Venkata Chari

|

Updated on: Jan 15, 2022 | 5:31 PM

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌(IPL)ను క్రికెట్‌లో అతిపెద్ద లీగ్‌గా పేర్కొనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ గొప్ప క్రికెట్(Cricket) యుద్ధంలో ప్రపంచంలోని ఎందరో దిగ్గజాలు ఆడటం కనిపిస్తుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన IPL మరింత ఉత్సాహంగా, సరదాగా సాగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు ఆడబోతున్నాయి. అదే సమయంలో, 2022 సీజన్‌లో అన్ని జట్ల రూపు రేఖలు మారనున్నాయి. 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈసారి మెగా వేలం(IPL 2022 Mega Auction) ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.

ఈసారి మెగా వేలంలో ధనవంతులు కాగల టాప్ 5 సీనియర్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా అద్భుత ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. గత రెండు సీజన్లలో వార్నర్ బ్యాట్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. గత ఐపీఎల్ సీజన్‌లో పేలవమైన ఫామ్ కారణంగా అతడు జట్టు నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ఆటగాడు అద్భుత ఫామ్‌లో టీ20 ప్రపంచకప్‌లో భయాందోళనలు సృష్టించాడు. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 38 బంతుల్లో 53 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా, ఆస్ట్రేలియా మొదటిసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

35 ఏళ్ల వయసున్న వార్నర్ ఈసారి ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిపించవచ్చు. టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన ఈ ఆటగాడు 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5449 పరుగులు చేయడంతోపాటు 2016లో కెప్టెన్సీలో హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపాడు.

శిఖర్ ధావన్.. 36 ఏళ్ల శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిలీజ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ధావన్ బ్యాట్ గత మూడు ఐపీఎల్ సీజన్‌లలో భీకరమైన ఫాంలో ఉంది. 2019లో 521, 2020 సీజన్‌లో 618, 2021లో 587 పరుగులు చేసిన ధావన్ టీ20 ప్రపంచ కప్‌లో ఎంపిక కాలేదు. ఫిబ్రవరిలో జరిగే IPL మెగా వేలంలో ఆ ఆటగాడిపై పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. ధావన్ అనుభవం కారణంగా, చాలా ఫ్రాంచైజీలు అతనిని తమ జట్టులో చేర్చుకునేందుకు పోటీపడతాయనడంలో సందేహం లేదు.

అలాగే ధావన్ మంచి కెప్టెన్‌గా కూడా నిరూపించుకోగలడు. ధావన్‌కి అతిపెద్ద సమస్య అతని స్ట్రైక్ రేట్. అతను వేగంగా పరుగులు చేయలేకపోయాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ కూడా గత మూడు సీజన్లలో చాలా మెరుగుపడింది. 2019లో, అతను 135.67 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. 2020లో 144.73 స్ట్రైక్ రేట్, 2021లో 124.26 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఫాఫ్ డు ప్లెసిస్.. ఈ 37 ఏళ్ల దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నిలబెట్టుకోలేదు. IPL 2021 సీజన్‌లో ఈ ఆటగాడు తన బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 633 పరుగులు చేశాడు. 2020 సీజన్ కూడా ఈ ఆటగాడికి అద్భుతంగా ఉంది. 13 మ్యాచ్‌ల్లో 449 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఈ ఆటగాడి స్ట్రైక్ రేట్ 140.75గా ఉంది. మెగా వేలంలో ఫాఫ్ ఈ అద్భుతమైన ప్రదర్శనకు తగిన ఫలితం పొందగలడు.

చెన్నై జట్టు ఈ ఆటగాడిని తిరిగి తమ జట్టులోకి చేర్చుకోవాలనుకుంటోంది. ఎందుకంటే గత మూడు సీజన్లలో సూపర్ కింగ్స్ తరఫున ఈ ఆటగాడి ప్రదర్శన ధోని జట్టు మరచిపోదు. ఏది ఏమైనప్పటికీ, మహి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ఎక్కువగా నమ్ముతాడు.

సురేష్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు సురేష్ రైనాను నిలబెట్టుకోలేదు. గత సీజన్‌లో రైనా బ్యాట్‌లో ప్రత్యేకత ఏమీ కనిపించకపోయినా ఈ ఆటగాడి ఐపీఎల్ రికార్డు మాత్రం అద్భుతం. 35 ఏళ్ల రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు.

రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ సురేష్ రైనాను తమ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. లక్నో నుంచి రైనాకు స్థానిక టచ్ ఉంది. అటువంటి పరిస్థితిలో, రైనా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు సురేశ్‌ రైనా బౌలింగ్‌ కూడా చేయగలడు. ఐపీఎల్‌లో 25 వికెట్లు కూడా తీశాడు. ఇలాంటి పరిస్థితిలో, వేలం సమయంలో ఈ విషయం కూడా అతనికి అనుకూలంగా ఉంటుంది.

డ్వేన్ బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆటగాడు 38 ఏళ్ల డ్వేన్ బ్రావో కూడా ఐపీఎల్ వేలంలో డబ్బుల వర్షం కురిపించవచ్చు. దీనికి అతిపెద్ద కారణం ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతని అద్భుతమైన రికార్డు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ బౌలర్‌ను ఫ్రాంచైజీలు దక్కించుకోవాలని చూస్తున్నాయి.

బ్రావో టీ20 క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. బ్రావో బ్యాట్‌తో కూడా బాగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 1537 పరుగులు కూడా చేశాడు.

Also Read: Australian Open: మరోసారి చిక్కుల్లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్.. రేపు కోర్టు కీలక నిర్ణయం.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేనా?

IND vs SA: భారత విజయానికి అడ్డుపడిన ‘హాక్-ఐ’ టెక్నాలజీ.. డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని సూపర్‌స్పోర్ట్‌ కావాలనే మార్చిందా?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో