IND vs SA: భారత విజయానికి అడ్డుపడిన ‘హాక్-ఐ’ టెక్నాలజీ.. డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని సూపర్‌స్పోర్ట్‌ కావాలనే మార్చిందా?

India vs South Africa DRS Controversy: డీఆర్‌ఎస్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అశ్విన్, కేఎల్ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంతో మ్యాచులో టీమిండియా పునరాగమనానికి దారులు మూసుకపోయాయి.

IND vs SA: భారత విజయానికి అడ్డుపడిన 'హాక్-ఐ' టెక్నాలజీ.. డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని సూపర్‌స్పోర్ట్‌ కావాలనే మార్చిందా?
India Vs South Africa Drs Controversy
Follow us

|

Updated on: Jan 15, 2022 | 4:18 PM

India Vs South Africa DRS Controversy: కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా(India Vs South Africa) జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆఫ్రికన్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై వివాదం చెలరేగింది. డీఆర్‌ఎస్ నిర్ణయంపై(DRS Controversy) టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), అశ్విన్, కేఎల్ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంతో మ్యాచులో టీమిండియా పునరాగమనానికి దారులు మూసుకపోయాయి. దీంతో మ్ నాల్గవ రోజున, దక్షిణాఫ్రికా 7 వికెట్ల విజయాన్ని నమోదు చేసింది. దీంతో సౌతాఫ్రికా టీం 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఈ వివాదం తర్వాత టీమ్‌ఇండియా ఆటగాళ్లు అసంతృప్తితో మరోసారి డీఆర్‌ఎస్‌పై చర్చలు మొదలయ్యాయి.

DRS, హాక్-ఐ టెక్నాలజీ అంటే ఏమిటి? భారత్-దక్షిణాఫ్రికా టెస్టులో ఆ ప్రశ్న ఎందుకు తలెత్తింది? కేప్‌టౌన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్రికన్ జట్టు ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన నాలుగో బంతి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ ప్యాడ్‌కు తగిలింది.

భారత ఆటగాళ్ల విజ్ఞప్తి మేరకు ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ ఎల్గర్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీనికి వ్యతిరేకంగా ఎల్గర్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేలు బంతి ఇన్-లైన్‌లో పిచ్ చేయబడి, ఎల్గర్ ప్యాడ్‌ల మధ్య కొట్టినట్లు చూపించాయి. కానీ, వింతగా బంతి లెగ్-స్టంప్ మీదుగా వెళుతున్నట్లు చూపించింది. అంటే, అది స్టంప్‌ను కొట్టలేదు. ఈ కారణంగా డీఆర్‌ఎస్‌లో థర్డ్ అంపైర్ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.

కెప్టెన్ కోహ్లితో సహా చాలా మంది భారత ఆటగాళ్లు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ కూడా ఈ నిర్ణయంతో షాక్ అయ్యాడు. స్టంప్ మైక్‌లో “ఇది అసాధ్యం” అని చెప్పడం వినిపించింది.

డీఆర్‌ఎస్ నిర్ణయంపై కోహ్లి, అశ్విన్, రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్‌ఎస్‌లో డీన్ ఎల్గర్‌ను ఔట్ చేయాలనే నిర్ణయాన్ని మార్చిన తర్వాత భారత కెప్టెన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు కలత చెందారు. కోహ్లి కోపంతో మైదానంలో కాలితో తొక్కుతూ స్టంప్ మైక్ వద్దకు వెళ్లి తన జట్టు ఆటపై దృష్టి పెట్టాలని సౌతాఫ్రికా బ్రాడ్‌కాస్టర్‌కు సూచించాడు.

వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా మైదానంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, “దేశం మొత్తం 11 ఆటగాళ్లతో ఆడుతోంది” అని పేర్కొన్కాడు. అశ్విన్ ఈ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్‌స్పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని, “సూపర్‌స్పోర్ట్ గెలవడానికి ఓ మంచి మార్గం వెతకాలంటూ” కామెంట్ చేశాడు.

ఎల్గర్ LBW నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ మార్చారా? నిజానికి, హాక్-ఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ. DRS, LBW విషయంలో, హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ అందించిన అదే బాల్ ట్రాకింగ్ డేటాను చూపుతుంది. భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ విషయానికొస్తే, బ్రాడ్‌కాస్టర్ సూపర్‌స్పోర్ట్‌గా వ్యవహరించింది.

దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్‌స్పోర్ట్‌పై అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. సోషల్ మీడియాలో కూడా, కొంతమంది భారతీయ అభిమానులు కూడా బ్రాడ్‌కాస్టర్ ఉద్దేశపూర్వకంగా DRS ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బ్రాడ్‌కాస్టర్ లక్ష్యం డబ్బు సంపాదించడమే అంటూ కామెంట్లు చేశారు.

సంచలనం సృష్టించిన హాక్-ఐ టెక్నిక్ ఏమిటి? హాక్-ఐ అనేది క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్‌తో సహా అనేక క్రీడలలో బంతి గమనం లేదా మార్గాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే కంప్యూటర్ విజన్ సిస్టమ్.

LBW నిర్ణయాలలో బౌలర్ నుంచి వికెట్ కీపర్ వరకు బంతి మొత్తం ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి క్రికెట్‌లో DRS నిర్ణయాలలో హాక్-ఐ ఉపయోగింస్తున్నారు.

హాక్-ఐ 2001 నుంచి క్రికెట్‌లో ఉపయోగింస్తున్నారు.

హాక్-ఐ సిస్టమ్‌ను UKకి చెందిన పాల్ విల్సన్ అభివృద్ధి చేశారు.

హాక్-ఐలో, బంతి కదలికను ట్రాక్ చేయడానికి మైదానంలో ఆరు వేర్వేరు ప్రదేశాలలో కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇది బాల్ బౌల్ చేసినప్పటి నుంచి బాల్ డెడ్ ఎండ్‌కు చేరుకునే వరకు మొత్తం ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది.

హాక్-ఐ ఒక ఊహాత్మక పిచ్‌పై బంతి ఎలా ప్రయాణిస్తుందో చూపించడానికి 3D ప్రొజెక్షన్‌గా సేకరించే ఏదైనా దృశ్యమాన సమాచారాన్ని మారుస్తుంది.

హాక్-ఐ సాంకేతికత వాస్తవానికి మెదడు శస్త్రచికిత్స, క్షిపణి ట్రాకింగ్‌లో ఉపయోగిస్తున్నారు.

LBW తీర్పును హాక్-ఐ మార్చగలదా? నివేదికల ప్రకారం, హాక్-ఐ స్పిన్, స్వింగ్, సీమ్ అన్ని రకాల పిచ్‌లపై బంతిని ట్రాక్ చేయగలవు. BBC నివేదిక ప్రకారం, హాక్-ఐ టెక్నిక్ 99% కేసులలో ఖచ్చితమైనది. అయినప్పటికీ, హాక్-ఐ సాంకేతికత ఇంకా అభివృద్ధిలో ఉందని, ఖచ్చితమైన తీర్పును ఇవ్వలేదని చాలా నివేదికలు విశ్వసిస్తున్నాయి.

డీన్ ఎల్గర్ మోకాలికి తగిలిన బంతి వికెట్ మధ్యలో లేకుంటే బెయిల్స్‌కు తగిలి ఉండేదని హాక్-హై నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ స్టార్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఒక అంతర్జాతీయ అంపైర్ DRS మానవులు నిర్ణయించేదనని, ఇందులోని ఖచ్చితత్వం దాని సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. అంటే అందులో పొరపాటు జరిగే అవకాశం ఉందనేది వాస్తవం.

అసలు DRS అంటే ఏమిటి? డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) అనేది క్రికెట్‌లో ఉపయోగించే ఒక టెక్నిక్. ఇది మ్యాచ్ సమయంలో అంపైర్లు,ఆటగాళ్లు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి ఉపయోగిస్తున్నారు. DRS అనేది ఒక ఆటగాడు ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించమని థర్డ్ అంపైర్‌ని అభ్యర్థించినప్పుడు మాత్రమే ఉపయోగించగలరు. దీనిని ‘ప్లేయర్ రివ్యూ’ అంటారు. అయితే, క్యాచ్ లేదా రనౌట్ వంటి నిర్ణయాలపై ఆన్-ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ని సంప్రదించినప్పుడు, దానిని ‘అంపైర్ రివ్యూ’ అంటారు.

క్రికెట్‌లో డీఆర్‌ఎస్ వినియోగం ఎప్పుడు మొదలైంది? 23 జూలై 2008లో భారత వర్సెస్ శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన టెస్టులో డెసిషన్ రివ్యూ సిస్టమ్ లేదా DRS మొదటిసారి ఉపయోగించారు. DRS మొట్టమొదట జనవరి 2011లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిరీస్‌లో వన్డేల్లో, అక్టోబర్ 2017లో భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగించారు. తరువాత, Snicko-meter, UltraEdge, Hawk Eye వంటి సాధనాలు కూడా DRSలో చేర్చరు.

Also Read: Watch Video: మీరు ప్లేయర్లా లేక వీధి రౌడీలా? లైవ్ మ్యాచులో ఇంతలా తన్నుకుంటారా.. నెటిజన్ల ఫైర్..! వైరల్ వీడియో

Watch Video: 134.1 స్పీడ్‌తో దూసుకొచ్చిన బంతి.. బొక్కబోర్లాపడ్డ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!