Watch Video: 134.1 స్పీడ్‌తో దూసుకొచ్చిన బంతి.. బొక్కబోర్లాపడ్డ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

Marnus Labuschagne: జోరుమీదున్న ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ విచిత్రంగా పెవిలియన్ చేరిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్‌లో లుబుషేన్ ఔటయ్యాడు.

Watch Video: 134.1 స్పీడ్‌తో దూసుకొచ్చిన బంతి.. బొక్కబోర్లాపడ్డ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
Ashes Series Stuart Broad
Follow us
Venkata Chari

|

Updated on: Jan 15, 2022 | 2:58 PM

Australia vs England: యాషెస్ సిరీస్‌(Ashes Series)లోని ఐదవ మరియు చివరి టెస్ట్ మ్యాచ్ హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ (AUS vs ENG) మధ్య జరుగుతుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగిన ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 303 పరుగులకు మించి దాటనివ్వలేదు. ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల నష్టానికి 241 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించింది. వార్నర్‌ జీరోకే పెవిలియన్ చేరాడు. వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఉస్మాన్‌ ఖవాజా కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఇలాంటి సరిస్థితుల్లో ట్రవిస్‌ హెడ్‌తో లబుషేన్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 53 బంతులు ఆడిన లబుషేన్(Labuschagne) 44 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు కూడా ఉన్నాయి.

జోరుమీదున్న ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ విచిత్రంగా పెవిలియన్ చేరిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్‌లో లుబుషేన్ ఔటయ్యాడు. అది‌ 23వ ఓవర్. 134.1 వేంగంతో వచ్చిన బాల్‌ను అడ్డుకోవడంలో విఫలమైన లుబుషేన్ విఫలమయ్యాడు. బంతిని ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వికెట్ ముందు బోర్లాపడ్డాడు. బంతి మాత్రం వికెట్లను ముద్దాడి బెయిల్స్‌ను పడేసింది.

ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్‌ను ఇలా బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి. ఇలా ఊహించని రీతిలో ఔటవ్వడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు ఈ ఆసీస్‌ బ్యాటర్.‌ సిరీస్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఇప్పటికే యాషెస్‌ సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా అవ్వడంతో, ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌లో పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.

బ్రాడ్ బౌలింగ్.. ఇంగ్లండ్‌లో అత్యంత విజయవంతమైన రెండో బౌలర్ బ్రాడ్. టెస్టుల్లో అతని పేరు మీద 500 కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ అతని కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. మునుపటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను తొమ్మిదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. ఖవాజా ఆరు పరుగులు చేశాడు.

బ్రాడ్ కెరీర్.. బ్రాడ్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను తన దేశం తరఫున ఇప్పటివరకు 151 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 531 వికెట్లు సాధించాడు. బ్రాడ్ బ్యాట్‌తోనూ చాలాసార్లు ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో అతని పేరు మీద 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. టెస్టుల్లో 18.53 సగటుతో 3411 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ ఫార్మాట్‌లో 121 మ్యాచ్‌లు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. టీ20లో 56 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు తీశాడు.

Also Read: U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!