AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి పుష్ప భారీ విజయాన్ని సమోదుచేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకోవడమే కాదు భారీ కలెక్షన్స్ కూడా కురిపిస్తుంది.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Pushpa
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2022 | 7:59 PM

Share

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి పుష్ప భారీ విజయాన్ని సమోదుచేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకోవడమే కాదు భారీ కలెక్షన్స్ కూడా కురిపిస్తుంది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని అన్నీ పాటలకు విశేష స్పందన లభించింది. అంతే కాదు ఈ సినిమాలో పాటల క్రేజ్ ఇప్పటికే దేశాలు దాటిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్ వైరల్ గా మారింది.  ఇప్పుడు ఈ స్టెప్ వేస్తూ చాలా మంది వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్లు కూడా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. అచ్చం బన్నీ స్టైల్ లో స్టెప్పేసి అదరగొట్టారు.

టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీవల్లి పాట స్టెప్ ను వేసి ఆకట్టుకున్నారు. శ్రీవల్లి పాట హిందీ వర్షన్ కు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే లే అనే డైలాగ్ ను రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ బన్నీ స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇలా శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇక పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Bangarraju: నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..

Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..