CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

CPI Narayana on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీ

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..
Narayana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2022 | 5:24 PM

CPI Narayana on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రధానపార్టీలు సైతం పలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi) సైతం స్పందించి.. ఆ వార్తలను ఖండించారు. తాను సీని పరిశ్రమ మేలు కోసం సీఎం జగన్ (CM YS Jagan)ను కలిసినట్లు పేర్కొన్నారు. కాగా.. చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తుందన్న ఊహాగానాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మంచి మిత్రుడని.. కానీ ఒంటరిగా ముఖ్యమంత్రిని కలవడం ఆయన చేసిన పొరపాటని నారయణ స్పష్టంచేశారు. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటి. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదుగా అంటూ ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్, చిరంజీవి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ వన్ టూ వన్ భేటీ ఇలాంటి ఊహాగానాలకు అవకాశమిచ్చిందంటూ నారాయణ తెలిపారు. ఇది సినీపరిశ్రమ సమస్య కాబట్టి ఆయా అసోసియేషన్లను వెంటబెట్టుకొని చిరంజీవి సీఎంను కలిసి ఉండాల్సిందని.. కానీ అలా చేయకుండా ఒంటరిగా వెళ్లారని నారాయణ పేర్కొన్నారు.

కాగా.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సొంత గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఆయనంబాకంలోని పొలంలో నారాయణ ట్రాక్టర్ నడిపారు. కోవిడ్ ప్రబలుతున్న ఈ సమయంలో సొంత గ్రామంలో ఉండడం క్షేమమని భావించి ఇక్కడే ఉన్నానంటూ నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవిపై నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) మండిపడ్డారు. సీఎంను చిరంజీవి కలిసింది కేవలం సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై మాత్రమేనంటూ శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవి అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంతమంది అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారన్నారు.

Also Read:

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట