Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

ఇటీవల కొందరు రాజకీయ నాయకులు రహదారులను తరచూ అందాల తారల బుగ్గలతో పోలుస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

ఇటీవల కొందరు రాజకీయ నాయకులు రహదారులను తరచూ అందాల తారల బుగ్గలతో పోలుస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోల్చారు. దీంతో ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ కూడా తన నియోజకవర్గంలోని రోడ్డు కత్రినా బుగ్గల్లా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలకు ఆజ్యం పోసిన ఘనత ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కే దక్కుతుంది. 2005  ఎన్నికల ప్రచారంలో భాగంగా  బీహార్ రోడ్లను హేమమాలిని చెంపలలాగా సున్నితంగా చేస్తానని వాగ్దానం చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. తాజాగా ఈ జాబితాలో జార్ఖండ్  కాంగ్రెస్ ఎమ్మెల్యే  డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ చేరారు.  తన నియోజకవర్గం జమ్తారాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సాఫీగా ఉంటాయని హామీ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కంగనా చూస్తే ఆయన పరిస్థితేంటో?

అయితే ఆయన ఏ సమావేశంలోనో, బహిరంగ సభలోనో, ప్రెస్ మీట్లోనూ ఈ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.   తన నియోజకవర్గంలోని రోడ్లు నటి కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితంగా ఉంటాయని ఇందులో చెప్పుకొచ్చారు.  ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానని.. అవసరమైతే చర్చకు కూడా రెడీ  అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.  కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. ‘నీ వ్యాఖ్యలను కంగనా చూస్తే.. నీ పరిస్థితేంటో అర్థం కావడం లేదు’,  ‘రోడ్డు మరీ అంత సున్నితంగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయేమో’ అంటూ అన్సారీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ ఎమ్మెల్యే ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఇటీవల కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు  తీవ్ర దుమారం లేపాయి. ఈ  వివాదం సద్దుమణగక ముందే  మళ్లీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

Also Read: Viral Photos: సముద్ర తీరంలో వింత ఆకృతులు.. రాత్రికి రాత్రే ఇలా.. విస్తుపోతున్న జనాలు..

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Omicron-Diet: ఒమిక్రాన్ అధికంగా ప్రభావం చూపించేది గొంతు పైనే.. రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోండి..

Published On - 2:29 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu