Omicron-Diet: ఒమిక్రాన్ అధికంగా ప్రభావం చూపించేది గొంతు పైనే.. రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోండి..

Omicron Diet: ఏ సమయంలో కరోనా వైరస్ (Corona Virus) వెలుగులోకి వచ్చిందో గాని.. రెండేళ్ళగా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ వైరస్ రోజుకో రూపాన్ని..

Omicron-Diet: ఒమిక్రాన్ అధికంగా ప్రభావం చూపించేది గొంతు పైనే.. రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోండి..
Diet To Fight Omicron
Follow us

|

Updated on: Jan 15, 2022 | 2:14 PM

Omicron Diet: ఏ సమయంలో కరోనా వైరస్ (Corona Virus) వెలుగులోకి వచ్చిందో గాని.. రెండేళ్ళగా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ వైరస్ రోజుకో రూపాన్ని సంతరిచుకుని.. మానవాళి అంతం నా పంతం అన్న చందంగా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ నుంచి బయపడుతున్నాం అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలో నేను ఉన్నానంటూ కరోనా వైరస్ సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా లో బయటపడిన ఈ వేరియంట్ బారిన దాదాపు అన్ని దేశాలు పడ్డాయి. రోజుకు మళ్ళీ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు సైతం ఈ వేరియంట్ కు భయపడుతున్నారు. ఓ వైపు వ్యాక్సిన్ (Corona Vaccine) ఇస్తూనే మరోవైపు బూస్టర్ డోసుని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కరోనా ముప్పు తప్పించుకోవాలంటే.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అంతేకాదు తినే ఆహారం, శారీరక వ్యాయామం కూడా ఒమిక్రాన్ బారినుంచి కాపాడతాయి.

*ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షించడంలో రోగనిరోధక శక్తిది అతిముఖ్య పాత్ర. కనుక ఇమ్యునిటీని ఇచ్చే ఆహారం రెగ్యులర్ గా తీసుకోవాలి. తినే ఆహారంలో ఫైబర్, విటమిన్ సి, మైక్రో న్యూట్రియంట్ల్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. *రోజు తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. *ముఖ్యంగా నెయ్యి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇది శరీరంలోని వెండి పెంచుతుంది. *ఈ శీతాకాలంలో దొరికే ఉసిరిలో ఔషధ గుణాలున్నాయి. రోగ నిరోధక శక్తిని ఇచ్చే విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక రొజూ పచ్చి ఉసిరి కాయని తిన్న లేదా ఉసిరి జ్యూస్ ను తాగినా ఆరోగ్యానికి మంచిది. *డైట్ లో మిల్లెట్స్ కూడా చేర్చుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కు మంచిది. మంచి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. *రాగి, బాజ్రా, జొన్నలు వంటి చిరుధన్యాలను కూడా తినే ఆహారంలో చేర్చుకోవాలి, ఇవి శీతాకాలంలో మంచి ఆహారం *అల్లంని కూడా రెగ్యులర్ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇది క్రిములను, వైరస్ లను ఎదుర్కోవడంలో మంచి సహాయకారి. గొంతు నొప్పి వంటి ఇబ్బందులను నివారిస్తుంది. *పసుపు కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది. గొంతు నొప్పి, గొంతు గరగర, దగ్గు వంటి ఇబ్బందులున్నప్పుడు ప్రతిరోజూ ఒక టీ స్పూన్ పుసుపుని..ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. *తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అత్యధికం. దీంతో తేనె జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. అంతేకాదు గొంతు ఇబ్బందులకు చక్కటి పరిష్కరం తేనె. కనుక తేనెను రొజూ అల్లం టీ లేదా వేడి నీటిలో వేసుకుని తాగినా అద్భుత ఫలితం ఉంటుంది.

Note: ఇది సాంప్రదాయ వైద్యం, మన పెద్దలు చెప్పిన ఆరోగ్య చిట్కాలు మాత్రమే.. కనుక ఎవరి శరీరానికి ఏమి సరిపోతాయో ఇక్కసారి వైద్యుడి సూచనలు కూడా తీసుకోవచ్చు.

Also Read: గోదావరి జిల్లాలో సంక్రాంతికి పందుల కుస్తీ పోటీలు.. తిలకించేందుకు తరలి వచ్చిన జనం