Sankrathi 2022: గోదావరి జిల్లాలో సంక్రాంతికి పందుల కుస్తీ పోటీలు.. తిలకించేందుకు తరలి వచ్చిన జనం
Makar Sankrathi 2022- Pigs Fighting: సంక్రాంతి పండగ అంటే చాలా మందికి గుర్తుకోచ్చేంది గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు (Cock Fight). తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు..
Makar Sankrathi 2022- Pigs Fighting: సంక్రాంతి పండగ అంటే చాలా మందికి గుర్తుకోచ్చేంది గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు (Cock Fight). తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు (Jallikattu), వాటిక ముంగిట రంగు రంగుల రంగవల్లులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళ సందడి, కొత్త సినిమాలు , హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, గాలిపటాల సందడి.. అయితే ఇప్పుడు సంక్రాంతి (sankranti) సంబరాల్లో మేము కూడా తక్కువ కాదంటూ పందులు(Pigs Fighting) కూడా పాల్గొంటున్నాయి. గోదావరి జిల్లలో పందుల పోటీలకు వేదికగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పందుల పోటీలను నిర్వహించారు. ఈ పందుల కుస్తీ పోటీలను చూడడానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా STసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు మాట్లాడుతూ.. తము సంక్రాంతి సంబ్రల్ల్లో సంప్రదాయానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. అంతేకాదు కత్తులతో కోడిపందాలు, గుండాట వంటి జూదాల తో కుటుంబాలు ఆర్ధికంగా పతనవుతున్నాయని.. అందుకనే తము మళ్ళీ సంప్రదాయా వేడుకలకు తెర తీసినట్లు చెప్పారు. ఏ విధమైన ప్రాణహాని లేకుండా రెండు జీవుల మధ్య జరిగే ఈ ఆట అందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని భావిస్తున్నామని చెప్పారు.
Also Read: