Makar Sankranti 2022: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..

Makar Sankranti 2022-megasgtar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి రోజున వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదారంగనాథుల కల్యాణ..

Makar Sankranti 2022: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..
Chiranjeevi At Godadevi Kalyanam
Follow us
Surya Kala

|

Updated on: Jan 15, 2022 | 1:01 PM

Makar Sankranti 2022-megasgtar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి రోజున వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా కృష్ణా జిల్లా డోకిపర్రుకి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో, సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వర్గాలు, వేదపండితులు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. వేదపండితులు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు.

గోదా దేవి కళ్యాణం అనంతరం చిరంజీవి దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, తీర్ధ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కళ్యాణ వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం సహా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌, డైరీలను మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు. గోదాదేవి కళ్యాణ ఉత్సవం పాల్గొనడం తన అదృష్టమని చిరంజీవి చెప్పారు. తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణం అనంత్సరం చిరంజీవి,సురేఖ దంపతులు డోకిపర్రు గ్రామంలో బస చేశారు. ఈ రోజు ఉదయం (శనివారం) ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌ కు చేరుకున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!