Makar Sankranti 2022:  కారంచేడులో సోదరి పురంధేశ్వరి ఇంట్లో బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు.. గుర్రం ఎక్కిన బాలయ్య, మోక్షజ్ఞ

Makar Sanranti 2022: ఆంధ్రుల అతి పెద్ద పండగ సంక్రాంతి (Sankranti). సాంప్రదాయ వేడుకలకు నెలవు సంక్రాంతి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో..

Makar Sankranti 2022:  కారంచేడులో సోదరి పురంధేశ్వరి ఇంట్లో బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు.. గుర్రం ఎక్కిన బాలయ్య, మోక్షజ్ఞ
Balakrishna

Makar Sanranti 2022: ఆంధ్రుల అతి పెద్ద పండగ సంక్రాంతి (Sankranti). సాంప్రదాయ వేడుకలకు నెలవు సంక్రాంతి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకోవడానికి సామాన్యులే కాదు సెలబ్రేటీలు సైతం ఇష్టపడతారు. ముఖ్యంగా సినిరంగానికి చెందిన పెద్ద హీరోలు సైతం తమ పనులన్నీ పక్కకు పెట్టి.. తమ కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) దంపతులు ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యుల తో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ కారంచేడు లోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశారు. బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంతున్నారు. బాలకృష్ణ నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. అనంతరం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. బాలకృష్ణ విన్యాసాలు చూసేందుకు భారీగా అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు.

ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం భార్య వసుంధర, తనయుడు మోక్షజ్ఞతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు.

Also Read:

దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో చెప్పలేం.. భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని..

Published On - 12:07 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu