Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పండగ వేళ విషాదం.. సెల్ఫీ మోజులో నదిలో పడిన యువతి.. కాపాడబోయి ప్రియుడు కూడా..

Lovers Missing in chitravati River: అనంతరపురం జిల్లా తాడిమరి మండలంలో పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. చిత్రావతి(chitravati River) నదిలో ప్రేమజంట..

Andhra Pradesh: పండగ వేళ విషాదం.. సెల్ఫీ మోజులో నదిలో పడిన యువతి.. కాపాడబోయి ప్రియుడు కూడా..
Lover Dead
Follow us
Surya Kala

|

Updated on: Jan 15, 2022 | 11:48 AM

Lovers Missing in chitravati River: అనంతరపురం జిల్లా తాడిమరి మండలంలో పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. చిత్రావతి(chitravati River) నదిలో ప్రేమజంట గల్లంతైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం స్థానికుల సాయంతో గాలిస్తున్నారు. అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్ద ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు ప్రేమికులు (Lovers) పడిపోయారు. ఈ జంట చిత్రావతి నది వద్దకు విహార యాత్రకు వెళ్ళినట్లు తెలుస్తోంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో రామాంజనమ్మ కాలు జారి కాలువలో పడిపోయింది. ఆ యువతిని కాపాడబోయిన అమర్నాథ్ కూడా నదిలో పడి కొట్టుకుని పోయాడు.

మృతులు బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల అమర్‌నాథ్, అనంతపురం ప్రకాష్‌నగర్‌కు చెందిన రామాంజనమ్మగా గుర్తించారు. సంక్రాంతి పండగకు దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన జంట కోసం గ్రామంలోని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.పండగ రోజు ఈ సంఘటన జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read: YSR Statues: చిత్తూరు జిల్లాలో వైఎస్ విగ్రహం ధ్వసం.. తాట తీస్తామంటూ డిప్యూటీ సిఎమ్ నారాయణస్వామి ఫైర్..

సూర్యకాంతి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.. అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..