YSR Statues: చిత్తూరు జిల్లాలో వైఎస్ విగ్రహం ధ్వంసం.. తాట తీస్తామంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..
YSR Statues: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది..
YSR Statues: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై వైఎస్ నేతలు కార్యకర్తలు ఘాటుగా స్పందించారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో వైయస్సార్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మండల కార్యాలయం ముందు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం చెయ్యి, ముఖాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైయస్ విగ్రహం పై దాడికి నిరసనగా వైసిపి కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనందరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండి పడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నారాయణస్వామి నిలదీశారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన నేతల తోలు తీస్తామని డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: