Viral Video: పాములతో మ్యూజిక్‌ షూట్‌… చివరికి ఎం జరిగిందో మీరే చూడండి.! నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

ఇటీవల పాములు, కొండచిలువలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. చాలామంది పాములను ముద్దు పెట్టుకోవడాలు, బెల్టులా ఒంటికి చుట్టుకున్న వీడియోలను మనం చూశాం. అయితే ...


ఇటీవల పాములు, కొండచిలువలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. చాలామంది పాములను ముద్దు పెట్టుకోవడాలు, బెల్టులా ఒంటికి చుట్టుకున్న వీడియోలను మనం చూశాం. అయితే పాములతో ఇలాగే సాహసం చేద్దామనుకున్న ఒక యంగ్ సింగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాములతో కలిసి నిర్వహించిన ఒక మ్యూజిక్‌ షూటింగ్‌లో ఒక పాము గాయనిని ముఖంపై కాటువేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జే జెడ్‌ లేబుల్ రోక్ నేషన్‌ అనే సంస్థ యంగ్‌ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్‌ వీడియో షూట్‌ని ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా గాయని నేల మీద పడుకుని పాములు ఒంటి మీద వేసుకుంటూ పాటలు పాడాలి.

షూట్‌లో భాగంగా బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించిన మేతా మొదట్లో కొన్ని పాములను శరీరంపై వేసుకుని పాటలు పాడడం ప్రారంభించింది . అయితే ఏమైందో తెలియదు కానీ అందులోని ఒక పాము అమాంతం ఆమె ముఖం మీద కాటు వేసింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి పాములను పక్కకు నెట్టేసింది సింగర్‌. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే మేతాను కరచిన పాము విషరహిత సర్పం. దీంతో ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. కాగా ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న మేతా.. ‘మీ అందరి కోసం మ్యూజిక్‌ వీడియోలు షూట్‌ చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా!’ అని రాసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అమెరికాలో టిక్‌టాక్‌ స్టార్‌గా గుర్తింపు ఉన్న మేతాకు సోషల్‌ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.

Published On - 8:57 am, Sun, 16 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu