Squirrel video viral: ప్రవర్తనలో తేడా.. 18 మందిని కరిచిన ఉడుత.. చివరికి ఏం జరిగిందంటే..?
సాధారణంగా ఉడుతలు చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. పైగా సాధుజంతువు. అలాంటి ఓ ఉడుత సైకోలా మారిపోయింది. రెండు రోజుల్లో రోఏకంగా 18 మందిని కరిచింది.
సాధారణంగా ఉడుతలు చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. పైగా సాధుజంతువు. అలాంటి ఓ ఉడుత సైకోలా మారిపోయింది. రెండు రోజుల్లో రోఏకంగా 18 మందిని కరిచింది. యూకేలోని బక్లీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణంలో నివాసముండే కొరిన్ రెనాల్డ్స్‌కు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. అందులో భాగంగానే రోజూ ఓ ఉడుతకు ఆహారం అందించేది. అయితే, క్రిస్మస్ పండగకు కొద్దిరోజుల ముందు ఏం జరిగిందో ఏమో కానీ ఉడుత క్రూరంగా మారిపోయింది. ఎదురొచ్చినవారందరినీ కరిచేసింది. ఇందులో మొదటి బాధితురాలు ఎవరో కాదు దానికి రోజూ ఆహారం అందిస్తున్న కొరినే కావడం గమనార్హం. ఒకరోజు ఎప్పటిలాగే ఆహారం అందిస్తుండగా ఆమెను గట్టిగా కరిచి అక్కడి నుంచి పారిపోయింది ఉడుత. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన ఆమె.. ఉడుత క్రూర స్వభావానికి గల కారణమేంటో తెలుసుకునే పనిలో పడింది.
రెండు రోజుల్లో 18 మందిని.. ఈక్రమంలో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసిన కొరిన్‌కు దిమ్మతిరిగే షాక్. అందులో పోస్టులన్నీ ఉడుత గురించే కావడంతో ఆమె మరింత కంగారు పడిపోయింది. ఉడుత కరిచిందన్న పోస్టులు కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు18 మంది ఉడుత బారిన పడ్డారు. దీని గురించి పట్టణమంతా తెలియడంతో ‘సైకో ఉడుత’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్ పేరు (స్రైప్) పెట్టారు. కాగా ఉడుతను ఇలాగే వదిలేస్తే మరింతమంది బాధితులు తయారువుతారని భావించిన కొరిన్ ఉడుతను ఎలాగైనా బంధించాలనుకుంది. పథకం ప్రకారం రోజూ ఆహారం పెట్టేచోట ఉచ్చు పెట్టి దానిని బంధించింది. అనంతరం దానిని ‘ది రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్’ అనే సంస్థకు అప్పగించింది.
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

