Viral Video: ఆ రోజున కుర్చీలను కిటికీల్లోంచి బయటకు విసిరేస్తారట..! ఎక్కడో తెలుసా..?(వీడియో)

World wide New Year Celebrations: జనవరి ఫస్ట్‌ మన సంప్రదాయమా..? కాదా..? అన్నది పక్కన పెడితే.. కొత్త ఆశలతో.. సరికొత్త ఆకాంక్షలతో.. కొంగొత్త కోరికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడం మనకు అలవాటయ్యింది..

Viral Video: ఆ రోజున కుర్చీలను కిటికీల్లోంచి బయటకు విసిరేస్తారట..! ఎక్కడో తెలుసా..?(వీడియో)

|

Updated on: Jan 16, 2022 | 8:07 AM



World wide New Year Celebrations: జనవరి ఫస్ట్‌ మన సంప్రదాయమా..? కాదా..? అన్నది పక్కన పెడితే.. కొత్త ఆశలతో.. సరికొత్త ఆకాంక్షలతో.. కొంగొత్త కోరికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడం మనకు అలవాటయ్యింది.. గుళ్లకు వెళ్లి దండంపెట్టుకోవడమూ పరిపాటిగా మారింది.. ఏదేమైనా గతించిన ఏడాదిలోని మధుర స్మృతులను మననం చేసుకుంటూ.. చేదు అనుభవాలను తుడిచేసుకుంటూ కొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.. జనవరి ఫస్టయినా.. ఉగాది అయినా.. తమిళుల పుత్తాండు అయినా అదో వేడుక! ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్తు మనకు బంగారుబాటలు వేస్తుందన్న నమ్మకం! ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతాం! అయితే, ఇంతేసి గ్రాండ్‌గా అందరూ న్యూఇయర్‌కు వెల్కమ్‌ చెబుతారనుకోడానికి లేదు.. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది..! ఎవరి సెంటిమెంట్లు వారివి మరి!

గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్‌.. కొత్త ఏడాది మంచి చేస్తుందని.. మన జీవితాలు సుఖమయమవుతాయని ఆశ! ఆ చిగురంత ఆశతోనే జగమంతా వేడుక చేసుకుంటుంది.. అయితే ప్రపంచమంతా ఇట్టాగే జరుపుకుంటుందని కాదు! ఒక్కో దేశపు ప్రజలు ఒక్కో తీరుగా జరుపుకుంటారు.. ఎవరి ఆచారాలు వారివి ! ఎవరి సంప్రదాయాలు వారివి! కొన్ని ఫన్నీగా ఉంటాయి.. కొన్ని వింతగొలుపుతాయి.. కొన్నేమో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఆ మాటకొస్తే కొన్ని దేశాలైతే జనవరి ఒకటిని న్యూ ఇయర్‌గానే గుర్తించవు.. చైనా…కొరియా.. సౌదీ అరేబియా… ఇజ్రాయెల్‌.. వియత్నాం దేశాలలో జనవరి ఫస్ట్‌న వేడుకలు గట్రాలు అస్సలుండవు.. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూ ఇయర్‌ వేడుకలుఆఫ్రికన్లు అయిన జీమా (Nzema) జాతి ప్రజలు జరుపుకునే న్యూ ఇయర్‌ వేడుకలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.. వీరి కొత్త సంవత్సరం జనవరిలో మొదలవ్వదు.. వీరి ఆకన్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబర్‌…నవంబర్‌ మాసాల్లో కొత్త సంవత్సరం వస్తుంది.. ఈ సందర్భంగా న్యూ ఇయర్‌ ఉత్సవాలను రెండు వారాల పాటు జరుపుకుంటారు..ఈ ఉత్సవాల సమయంలో ఏ పనీ చేయరు.. ఆఖరికి వ్యవసాయ పనులకు కూడా బ్రేక్‌ ఇస్తారు.. పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలను పోస్ట్‌పోన్‌ చేసుకుంటారు.. ఎందుకంటే వేడుకల్లో అందరూ పాల్గొనాలిగా..!

Follow us