Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

అక్కినేని హీరో సుమంత్ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మళ్ళీ రావా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ మళ్లీ అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Sumanth's Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన 'మళ్లీ మొదలైంది'.
Sumanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2022 | 8:30 PM

Sumanth: అక్కినేని హీరో సుమంత్ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మళ్ళీ రావా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ మళ్లీ అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ మొదలైంది అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో యాంకర్ వర్షిణి నటించింది. ఈ సినిమా విడాకుల తర్వాత ఓ మగాడి జీవితం ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో చాలా మంది థియేటర్స్ కు నో చెప్పి ఓటీటీకి ఓకే చెప్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ మొదలైంది సినిమా కూడా ఓటీటీ లో విడుదల కానుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్నఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో సుహాసిని పోసాని కృష్ణ మురళి, మంజుల, వర్షిణి సౌందర్ రాజన్ అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్ నటించారు. మరి ఈ సినిమా సుమంత్ కు మరో హిట్ అందిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..

Dil Raju : సోదరుడి కుమారుడు రెండో సినిమా కోసం సుకుమార్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!