పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. VPF ద్వారా అధిక రాబడి.. ఇంకా పన్నుమినహాయింపు

VPF: వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) అనేది పన్ను ఆదా చేసే ఒక పెట్టుబడి ఎంపిక. VPFలో డిపాజిట్ చేసిన డబ్బుపై ఆదాయపు పన్ను చట్టంలోని

పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. VPF ద్వారా అధిక రాబడి.. ఇంకా పన్నుమినహాయింపు
Vpf
Follow us
uppula Raju

|

Updated on: Jan 17, 2022 | 7:48 PM

VPF: వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) అనేది పన్ను ఆదా చేసే ఒక పెట్టుబడి ఎంపిక. VPFలో డిపాజిట్ చేసిన డబ్బుపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. VPF ద్వారా ఒక సంవత్సరంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ.46,800 పన్ను ఆదా చేసుకోవచ్చు. VPF ప్రభుత్వ హామీని పొందింది కాబట్టి ఇందులో డిపాజిట్ చేయబడిన డబ్బు పూర్తిగా సురక్షితం. VPF లేదా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ EPFలో ఒక భాగం మాత్రమే.

ముందుగా VPF అంటే ఏమిటి EPFలో ఇది ఎలా భాగమో తెలుసుకుందాం. EPF నియమం ప్రకారం.. ప్రతి నెలా ఒక ఉద్యోగి బేసిక్ జీతంలో కనీసం 12 శాతం ఈపీఎఫ్‌లో డిపాజిట్ చేస్తారు అలాగే మరో 12 శాతం వాటాను కంపెనీ తరపున ఉద్యోగి పీఎఫ్‌లో జమ చేస్తారు. అయితే ఉద్యోగి 12 శాతం మాత్రమే డిపాజిట్ చేయాలని నియమం లేదు. అతను PF లో కోరుకున్నంత డబ్బును డిపాజిట్ చేయవచ్చు. కానీ కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బు మాత్రం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఇందులో మార్పు ఉండదు.

VPF అంటే ఏమిటి

జీతంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేసిన తర్వాత ఉద్యోగి అదనంగా డిపాజిట్‌ చేసే డబ్బును వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. అంటే 12 శాతం నుంచి అదనపు మొత్తాన్ని VPF డబ్బు అంటారు. ఒక ఉద్యోగి తన వీపీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు కావాలంటే అంత జమ చేసుకోవచ్చు. VPFలో డిపాజిట్ చేసిన డబ్బుకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. VPF అనేది పన్ను ఆదాకి ఉత్తమ సాధనంగా చెబుతారు. ఎందుకంటే ఇతర పథకాలలో మీరు 5-6 శాతం రాబడిని మాత్రమే పొందగలరు, EPF లేదా VPFలో మీకు 8.5% వడ్డీ లభిస్తుంది. అలాగే ఏడాదికి రూ.1.5 లక్షల పన్ను ఆదాతో నేరుగా రూ.46,800 పన్ను ఆదా చేసుకోవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే VPF కోసం ప్రత్యేక ఖాతా తెరవవలసిన అవసరం కూడా లేదు.

EPFలో ఉన్నట్లే VPFలో కూడా పన్ను ప్రయోజనం లభిస్తుంది. రెండిటి నియమం ఒకటే. VPFలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి పన్ను చెల్లింపుదారు రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. VPFలో జమ చేసిన డబ్బుకు పన్ను రహితం విత్‌ డ్రాపై పన్ను ఉండదు. 5 సంవత్సరాల తర్వాత VPF నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంపై పన్ను ఉండదు. మీరు 5 సంవత్సరాలలోపు పాక్షిక ఉపసంహరణ లేదా పూర్తి ఉపసంహరణ చేస్తే ఆ డబ్బుకు పన్ను విధిస్తారు. PPFలో డబ్బును పెట్టుబడి పెట్టడం కంటే VPFలో పెట్టుబడి పెట్టడం మంచిది ఇందులో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. 80C కింద 1.5 లక్షల మినహాయింపు దొరుకుతుంది.

జన్‌ధన్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి నుంచి ఆ సౌకర్యాలు లభించే అవకాశం..?

Aloevera: అలోవెరా జెల్‌ అద్భుత ప్రయోజనాలు.. బరువు తగ్గించడంలో సూపర్..

తక్కువ ధరకే కారు కొనే అవకాశం.. ఈ మోడల్స్‌పై లక్షా ముప్పై వేల తగ్గింపు..