Budget 2022: బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారా.. ఎరువులపై సబ్సిడీ భారీగా పెరిగే అవకాశం ఉందా?
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్దికసంవత్సరానికి సంబంధించి దేశ బడ్జెట్ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపధ్యంలో వ్యవసాయ రంగానికి(Agriculture Industry) సంబంధించి ఆర్ధిక మంత్రి రైతుల కోసం ..
Agriculture Budget 2022: తమ ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు రైతులకు విక్రయించినందుకు ఎరువుల కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో దాదాపు 19 బిలియన్ డాలర్లు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎరువుల సబ్సిడీగా రూ. 1.4 లక్షల కోట్లు (18.8 బిలియన్ డాలర్లు) పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో రూ. 1.3 లక్షల కోట్లకు చేరుకుంది. ముడిసరుకు ఖర్చులు పెరగడం వల్ల ప్రజలు సబ్సీడీని పెంచాలని కోరుతున్నారు. అయితే ఎంతవరకు నెరవేరుస్తారో బడ్జెట్ 2022లో చూడాలి. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.
పెరిగిన ఖర్చులు కీలకమైన ఎన్నికలకు ముందు లెక్కలోకి రానున్నాయి. అయితే అప్పటి నుంచి రద్దు చేసిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలను ఎదుర్కొని రైతులను గెలవడానికి పాలక బీజేపీ కీలక ప్రయత్నాలు చేస్తోంది.
భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 60 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నికలలో గెలవడానికి వారి మద్దతు ఎంతో కీలకం కానుంది. 2021 ఫిబ్రవరిలో విడుదల చేసిన బడ్జెట్‌లో దాదాపు రూ. 80,000 కోట్లు కేటాయించిన తర్వాత నిరసనల మధ్య ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని గణనీయంగా పెంచవచ్చని భావిస్తున్నారు.
Also Read: Budget 2022: ఉపాధి రంగంలో యువత అంచనాలకు పెద్దపీట వేస్తారా.. ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారు?
Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!