Budget 2022: ద్విచక్ర వాహనాలు విలాసవంతమైనవి కావు.. అందుకే వాటిపై జీఎస్టీ తగ్గించండి: ఎఫ్‌ఏడీఏ

26,500 డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న 15,000 మంది ఆటోమొబైల్ డీలర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA), ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువు కాదని, వాటిపై GST తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Budget 2022: ద్విచక్ర వాహనాలు విలాసవంతమైనవి కావు.. అందుకే వాటిపై జీఎస్టీ తగ్గించండి: ఎఫ్‌ఏడీఏ
Two Wheelers
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2022 | 10:33 PM

Industry Budget 2022: ఆటోమొబైల్ విభాగంలో డిమాండ్‌ను సృష్టించేందుకు ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘం FADA ప్రభుత్వాన్ని కోరింది. 26,500 డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న 15,000 మంది ఆటోమొబైల్ డీలర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA), ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువు కాదని, అందువల్ల GST రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీ రేట్లను 18 శాతానికి నియంత్రించి, మనదేశంలో ఆటోమొబైల్ రంగాన్ని మంరింత ముందుకు తీసుకెళ్లాలని FADA ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తోంది”అని పరిశ్రమల సంఘం సోమవారం పేర్కొంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2022-23 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ద్విచక్ర వాహనాలను విలాసవంతమైన వస్తువుగా కాకుండా దూరప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రయాణించడానికి అవసరమైనదిగా గుర్తించాలని కోరారు. అది వారి రోజువారీ పని అవసరాలకు అనుగుణంగా వాడుతున్నారని వారు పేర్కొన్నారు.

‘లగ్జరీ ఉత్పత్తులపై 28 శాతం GST + 2 శాతం సెస్ ఉంది. అయితే ఇది ద్విచక్ర వాహన వర్గానికి మంచిది కాదు” అని FADA పేర్కొంది. ముడి సరుకుల ఖర్చులతోపాటు అనేక ఇతర కారణాల వల్ల 3-4 నెలల విరామం తర్వాత వాహనాల ధరలు పెరుగుతున్న తరుణంలో, GST రేట్లు తగ్గించాలని, దీంతో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్‌ను పెంచడానికి సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.

డిమాండ్‌లో పెరుగుదలతో వీటిపై ఆధారపడిన అనేక రంగాలపై దాని ప్రభావాలు ఉంటాయి. దాంతో పన్ను వసూళ్లు పెంచుతాయని FADA విశ్వసిస్తోంది. ప్రభుత్వం, డీలర్లు, వాహన యజమానులకు అనుకూలమైన పరిస్థితిని ఏర్పరచడానికి ఉపయోగించిన అన్ని వాహనాలకు మార్జిన్‌పై 5 శాతం GST రేటును ఉంచాలని FADA కోరింది.

“GST తగ్గింపుతో, పరిశ్రమ అసంఘటిత విభాగం నుంచి వ్యవస్థీకృత విభాగానికి మారడానికి ఇది సహాయపడుతుంది. తద్వారా పన్ను లీకేజీలకు బ్రేక్ వేసి, GST పరిధిలోకి మరింత వ్యాపారాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది” అని FADA పేర్కొంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉపయోగించిన కార్లపై 12 నుంచి 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేస్తోంది. 4,000 మిమీ లోపు కార్లకు 12 శాతం జీఎస్టీ, 4,000 మిమీ కంటే ఎక్కువ ఉన్న వాహనాలకు 18 శాతం పన్ను విధిస్తోంది.

”ఉపయోగించిన కార్ల వ్యాపారం కొత్త కార్ల మార్కెట్ కంటే 1.4 రెట్లు విస్తరించింది. ఇది రూ. 1.75 ట్రిలియన్లకు పైగా టర్నోవర్‌తో సంవత్సరానికి 5-5.5 మిలియన్ కార్లను కలిగి ఉంది. ఈ వ్యాపారంలో అధీకృత డీలర్ల వాటా 10-15 శాతం మాత్రమే’’ అని FADA పేర్కొంది. రూ. 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించిందని పరిశ్రమల సంఘం గుర్తించింది.

”ఆటో డీలర్‌షిప్ కమ్యూనిటీలోని చాలా మంది వ్యాపారులు ఈ కేటగిరీకి చెందినందున అన్ని LLP, యాజమాన్య, భాగస్వామ్య సంస్థలకు కూడా అదే ప్రయోజనం వర్తింపజేయాలి. ఇది 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పించే వ్యాపారుల మనోధైర్యం, సెంటిమెంట్‌ను పెంపొందించడానికి సహాయపడుతుంది”అని FADA పేర్కొంది. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అభ్యర్థిస్తోంది.

Also Read: Budget 2022: బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారా.. ఎరువులపై సబ్సిడీ భారీగా పెరిగే అవకాశం ఉందా?

Budget 2022: ఉపాధి రంగంలో యువత అంచనాలకు పెద్దపీట వేస్తారా.. ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారు?