Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..
దేశ ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ వచ్చేనెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్(Budget 2022) ప్రవేశపెట్టడానికి సిద్ధం అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో వివిధ రంగాల నుంచి డిమాండ్లు.. సూచనలు.. కోరికలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ వచ్చేనెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్(Budget 2022) ప్రవేశపెట్టడానికి సిద్ధం అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో వివిధ రంగాల నుంచి డిమాండ్లు.. సూచనలు.. కోరికలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ అంటే పన్నుల గురించి ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఆ తరువాత అందరి దృష్టీ ఉండేది వ్యవసాయ రంగం(Agriculture Sector)పైనే. ఎందుకంటే, మన దేశంలో ఎక్కువ మంది ఆధారపడేది.. ఎక్కువ ఇబ్బందులు పడేదీ వ్యవసాయ రంగమే. గత సంవత్సరం బడ్జెట్ లో వ్యవసాయరంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఆ బడ్జెట్ లో ఏ ప్రతిపాదనలు చేశారు ఒకసారి పరిశీలిద్దాం..
గత సంవత్సరం బడ్జెట్ ఏంతంటే..
మంత్రిత్వ శాఖకు 2021-22లో రూ. 1,31,531 కోట్లు కేటాయించారు. 2019-20 కంటే 14% వార్షిక పెరుగుదల ఈ కేటాయింపుల్లో కనిపించింది. [మంత్రిత్వ శాఖకు కేటాయింపులు ప్రభుత్వ బడ్జెట్‌లో 4%గా ఉంది. 2020-21లో రూ. 1,42,762 కోట్ల వ్యయం అవుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది, ఇది సవరించిన దశలో 13% తగ్గి రూ. 1,24,520 కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా అంచనా వేసిన దాని కంటే తక్కువ లబ్ధిదారుల కవరేజీ కారణంగా PM-KISAN పథకం (రైతులకు ఆదాయ మద్దతు పథకం)పై ప్రతిపాదిత వ్యయంలో రూ. 10,000 కోట్ల కోత కూడా ఆ సంవత్సరంలో ఉంది. 2020-21 అలాగే 2021-22లో, PM-KISAN ఖర్చు రూ. 65,000 కోట్లుగా ఉంది.
2021-22లో మంత్రిత్వ శాఖకు 49% కేటాయింపులు PM-KISAN స్కీమ్ కోసం ఇచ్చారు. వడ్డీ రాయితీ, పంట బీమాతో సహా మంత్రిత్వ శాఖ అన్ని ఇతర కార్యక్రమాలకు 2021-22లో రూ. 66,531 కోట్లు కేటాయించడం జరిగింది, ఇది 2019-20 కంటే 12% వార్షిక పెరుగుదల కావడం గమనార్హం.
2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వ్యవసాయానికి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలు చేశారు:
వ్యవసాయ మౌలిక సదుపాయాలు .. ఇతర అభివృద్ధి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి కొన్ని వస్తువులపై వ్యవసాయం .. మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ విధించడం జరుగుతుంది. ఈ వస్తువులలో పత్తి, బొగ్గు, బంగారం, వెండి .. మద్య పానీయాలు .. పెట్రోల్ .. డీజిల్ వంటి కొన్ని దిగుమతులు ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల (APMCలు) మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్)తో మరో 1,000 మండీలు అనుసంధానం చేస్తారు.
ప్రస్తుతం టమోటాలు, ఉల్లిపాయలు .. బంగాళదుంపల నిల్వ .. రవాణాపై సబ్సిడీని అందించే ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విలువ జోడింపు .. ఎగుమతులను పెంచడానికి 22 పాడైపోయే ఉత్పత్తులను కవర్ చేయడానికి విస్తరించడం జరుగుతుంది.
వ్యవసాయం, సహకారం .. రైతుల సంక్షేమ శాఖ 2021-22లో మంత్రిత్వ శాఖకు 94% కేటాయింపులను పొందింది. అయితే అందులో 6% వ్యవసాయ పరిశోధన .. విద్యా శాఖకు కేటాయించారు.
ప్రాధమికంగా వ్యవసాయ బడ్జెట్ కు సంబంధించి గతసంవత్సరం అంటే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి ప్రతిపాదనలు ఇవే. అయితే, పోయిన సంవత్సరం లానే ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా కరోనా తన పని తానూ చేసుకుపోయింది. ఈ నేపధ్యంలో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగమూ ప్రభావితం అయింది.
బడ్జెట్ 2022 కేటాయింపులు ఎలా ఉండాలని భావిస్తున్నారు?
కచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండాలనే డిమాండ్ నిపుణుల నుంచి ఉంది. అంతే కాకుండా వ్యవసాయ సబ్సిడీలను పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ముఖ్యంగా ఎరువులపై సబ్సిడీ తో పాటు.. రవాణాపై సబ్సిడీని కూడా పెంచాలని కోరుతున్నారు.
అంతేకాకుండా కొత్త టెక్నాలజీ వైపు వ్యవసాయరంగాన్ని మళ్ళించేలా ప్రతిపాదనలు ఉండాలని కూడా నిపుణులు భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల నిధి అంతగా రైతులకు చేరలేదనే భావన ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్ లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎక్కువ కేటాయింపులు ఉండాలని కూడా కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!