AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మశానంలో ఖననం చేస్తుండగా శవపేటికలో వింత శబ్ధాలు.. తీసి చూస్తే షాక్..!

ఒక వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత, ఆ వ్యక్తి తిరిగి బ్రతికలేడని చెబుతారు. కానీ స్పెయిన్‌లో, పూర్తిగా భిన్నమైన కథ కనిపించింది. అక్కడ ఒక వృద్ధ మహిళ స్మశానవాటికకు వెళ్లి తిరిగి బ్రతికింది. చనిపోయిందనుకుని అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, ఆమె శరీరం, వేళ్లు కదులుతూ కనిపించాయి. దీంతో అంతా షాక్ అయ్యారు.

స్మశానంలో ఖననం చేస్తుండగా శవపేటికలో వింత శబ్ధాలు.. తీసి చూస్తే షాక్..!
Spain Women Alive
Balaraju Goud
|

Updated on: Apr 24, 2025 | 8:46 PM

Share

చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికి రావడం మనం అరుదుగా చూస్తాం. ఒకవేళ అది ఎక్కడైనా జరిగితే చాలా షాకింగ్ గా ఫీల్ అయ్యి.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తాం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ప్రాణాలతో లేచి కూర్చుంది. చాలాసార్లు మనం ఇలాంటి సంఘటనలను మన కళ్ళ ముందు జరిగే ఉంటాయి. చాలా సార్లు ఇలాంటివి మనకు అద్భుతాలుగా అనిపిస్తాయి. కానీ ఏమీ జరగవు. తాజాగా స్పెయిన్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, చనిపోయిన ఒక మహిళకు అంత్యక్రియలు చేస్తుండగా.. ప్రాణాలతో బయటపడింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చూసి షాక్ అయ్యారు.

ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఒక వృద్ధ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో జువాన్ మార్చి డి బున్వోలా ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమె పరిస్థితి చూసిన వెంటనే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ మహిళ అంత్యక్రియలకు సిద్ధం చేసి స్మశానవాటికకు తీసుకెళ్లారు. ఇక్కడ స్మశానవాటిక సిబ్బంది ఆ మహిళను సమాధి వేయబోతుండగా, ఆమె శరీరం, వేళ్లు కదులుతున్నట్లు చూశారు.

మొదట్లో అక్కడున్న వారంతా దీనిని యాదృచ్చికంగా జరిగిందని భావించి పూర్తిగా విస్మరించారు. అయితే, ఇది పదే పదే జరుగుతుండటంతో ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత, అక్కడ ఉన్న వ్యక్తులు భయపడి, ఆమెను మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మహిళ నిజంగా బతికే ఉందని పారామెడిక్స్ చూశారు. దీని తరువాత, వైద్యులు తమ దర్యాప్తును ప్రారంభించి, ఆ మహిళ నిజంగానే బతికే ఉందని నిర్ధారించారు. కానీ ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కొద్ది సేపటికే ఆ మహిళ మరణించింది.

ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆ మహిళ మళ్ళీ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే, ప్రపంచంలో ఇలాంటి కేసు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఒక మహిళ పోషకాహార లోపంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు. కానీ స్మశానవాటికకు చేరుకున్న తర్వాత, ఆమె తిరిగి బ్రతికింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినప్పటికీ ఆమె కొన్ని గంటలు మాత్రమే బతికి చనిపోయింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..