Budget 2022: దిగుమతి సుంకం నుంచి జీఎస్టీ వరకు.. బడ్జెట్ నుంచి మొబైల్ పరిశ్రమ ఏం ఆశిస్తోందంటే?

మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే మదర్‌బోర్డులు, మెకానిక్స్ కాంపోనెంట్‌లు మొదలైన వాటితోపాటు మొబైల్ ఫోన్ ఉపకరణాల తయారీకి ఉపయోగించే విడి భాగాలపై పన్నులను తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది.

Budget 2022: దిగుమతి సుంకం నుంచి జీఎస్టీ వరకు.. బడ్జెట్ నుంచి మొబైల్ పరిశ్రమ ఏం ఆశిస్తోందంటే?
Smart Phones
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2022 | 10:32 PM

Industry Budget 2022: మొబైల్ ఫోన్‌ల తయారీకి ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంపోనెంట్స్‌పై పన్నులు పెంచడం వల్ల పీఎల్‌ఐ పథకం కింద భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీ లేకుండా చేయవచ్చని పరిశ్రమల సంఘం ఐసీఈఏ పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో తయారీదారుల వృద్ధికి అడ్డంకిగా ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) డిమాండ్ చేస్తోంది. దీంతోనే గ్రామీణ భారతదేశంలోని వెనుకబడిన వర్గాలు మొబైల్ ఫోన్‌లను కొనగలరని లేదంటే వారికి ఈ జీఎస్టీతో మరింత భారం పడుతుందని కోరుతోంది. 2020 జనవరికి ముందు ఉన్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ప్రోత్సాహాన్ని అందించిందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

“ఆర్థిక సంవత్సరం (FY) 2020-21 నుంచి 2021-22 వరకు యూనియన్ బడ్జెట్‌లలో విధి విధానంలో మార్పుల తర్వాత భారీ తేడా ఏర్పడింది. దిగుమతి సుంకాలను పెంచడం మొబైల్ పరిశ్రమలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కొన్ని కంపెనీలు, తమ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు పోటీ లేని ధరలకు అందజేస్తున్నాయి” అని మోహింద్రూ తెలిపారు.

Samsung, Apple కాంట్రాక్ట్ తయారీదారులు PLI పథకం కింద అతిపెద్ద పెట్టుబడిదారులు మరియు ఈ రెండు బ్రాండ్‌లు భారతదేశం నుండి మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పీఎల్‌ఐ పథకం కింద రూ.10.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే శాంసంగ్, యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు పీఎల్‌ఐ పథకం కింద వీటి పెట్టుబడిదారులతో కలిసి ఈ రెండు బ్రాండ్‌లు భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని పేర్కొంది.

కెమెరా లెన్స్‌లపై 15 శాతం, మిగిలిన భాగాలపై 2.5 శాతం పన్నును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, భారతదేశంలో కెమెరా మాడ్యూల్స్ ఉత్పత్తిని పోటీగా మార్చే విధంగా ఉందని, మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే పూర్తి కెమెరా మాడ్యూళ్ల వల్ల పన్నులను హేతుబద్ధం చేయాలని మొహింద్రూ కోరారు. 11 శాతం దిగుమతి సుంకం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆయన వాపోయారు.

మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే మదర్‌బోర్డులు, మెకానిక్స్ కాంపోనెంట్స్ మొదలైన వాటితో పాటు పవర్ బ్యాంక్‌ల కోసం లిథియం-అయాన్ సెల్స్, వైర్‌లెస్ కోసం వాడే ముడి పదార్థాలు వంటి మొబైల్ ఫోన్ ఉపకరణాల తయారీకి ఉపయోగించే భాగాలపై పన్నుల హేతుబద్ధీకరణ కోసం పరిశ్రమ సంఘం పిలుపునిచ్చింది.

“మార్చి 2020లో GSTని 50 శాతం పెంచారని, దీంతో మొబైల్ పరిశ్రమకు తీవ్రమైన దెబ్బ తగిలింది. GST కౌన్సిల్‌కు సమర్పించిన హేతుబద్ధత లోపభూయిష్టంగా ఉంది. GSTకి ముందు కాలంలో, ఎక్సైజ్ సుంకం, వ్యాట్ 6 శాతం (చాలా రాష్ట్రాల్లో) ఉండగా, సగటు 7.2 శాతంగా ఉండేది. మొబైల్ తయారీలో అన్ని భాగాలు, ఉపకరణాలు తయారీకి జీరో డ్యూటీలో ఉన్నాయి” అని ICEA పేర్కొంది. Apple, Foxconn, Wistron, Lava, Vivoతో కూడిన పరిశ్రమల సంస్థ ICEA ప్రకారం, 2020-21లో దేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి గరిష్టంగా రూ. 2.2 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2022 నాటికి రూ. 2.75 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. దేశీయ మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఈ పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది.

“ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంచేందుకు దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను 55 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4 లక్షల కోట్లు) విస్తరించడానికి, మొబైల్‌పై జీఎస్‌టీకి సంబంధించి యథాతథ స్థితిని పునరుద్ధరించడం అత్యవసరంగా మారింది. మొబైళ్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలి.ఇది గ్రామీణ భారతదేశంలోని వెనుకబడిన వర్గాలు, పేదలు అలాగే మహిళలు, యువత చేతుల్లో మొబైల్ ఫోన్‌లను ఉంచడంలో సహాయపడుతుంది” అని ICEA తెలిపింది.

మొబైల్ ఉత్పత్తిలో భారతీయ కంపెనీల వాటా 2016లో 47 శాతం ఉండగా, ప్రస్తుతం దాదాపు 8 శాతానికి తగ్గింది. భారతీయ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 1,000 కోట్ల వరకు రుణాలకు 5 శాతం వడ్డీ రాయితీని అందించాలని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం దేశీయ కంపెనీలకు రూ. 500 కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ (రివాల్వింగ్) అందించేందుకు ICEA ప్రభుత్వానికి రూ. 1,000 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. PLI పథకం కిందకు వచ్చేవారికి రూ. 1,000 కోట్ల మెరుగైన క్రెడిట్ హామీని అందించాలని సూచించింది.

“ఒక దేశం తన స్వంత కంపెనీలను నిర్మించుకున్నప్పుడు మాత్రమే, దేశంలో నిజమైన సాంకేతిక పరిజ్ఞాన సముపార్జన, నైపుణ్యం-నిర్మాణం జరుగుతుంది. అయితే ఒక విదేశీ కంపెనీకి ఇలాంటి సడలింపులు అందిస్తే స్వదేశీ కంపెనీలు మూలన పడగతాయనడంలో సందేహం లేదు.దేశీయ కంపెనీలకు సడలింపులు ఇస్తే గ్లోబల్ ఇండియన్ ఛాంపియన్‌లుగా మారే అవకాశం ఉన్న జాతీయ ఛాంపియన్‌లు జాతీయ సంపదను సృష్టించి, ఆర్థిక ప్రగతికి ఐకాన్‌లుగా మారేందుకు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు” అని మోహింద్రూ చెప్పారు.

Also Read: Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..

Budget 2022: ద్విచక్ర వాహనాలు విలాసవంతమైనవి కావు.. అందుకే వాటిపై జీఎస్టీ తగ్గించండి: ఎఫ్‌ఏడీఏ