- Telugu News Photo Gallery Cinema photos Do You Know Golkonda High School Movie Child Artist Now Crazy Hero In Tollyood, he Is Sangeeth Shobhan
Tollywood: గోల్కొండ హైస్కూల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. కామెడీ ఇరగదీసే కుర్రాడు.. ఈ హీరో ఎవరంటే..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా మారారు చాలా మంది. చిన్నప్పుడే తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఇప్పుడు వెండితెరపై దూసుకుపోతున్నారు. అందులో ఈ కుర్రాడు కూడా ఒకరు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
Updated on: Dec 25, 2024 | 7:08 PM

డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ మూవీ గోల్కొండ హైస్కూల్. ఇందులో సుమంత్, స్వాతి జంటగా నటించగా.. ఇందులో హీరో సంతోష్ శోభన్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఈ కుర్రాడు తన నటనతో మెప్పించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.

ఆ కుర్రాడు మరెవరో కాదు.. సంగీత్ శోభన్. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. అంతేకాదు.. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు. మ్యాడ్ సినిమాతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు.

దివంగత డైరెక్టర్ శోభన్ తనయులే వీరిద్దరు. దివంగత కమెడియన్ లక్ష్మీపతి తమ్ముడు శోభన్. ఇదిలా ఉంటే.. సంగీత్ శోభన్ చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

ఆ తర్వాత ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు. అలాగే త్రీ రోజేస్ వెబ్ సిరీస్ సైతం చేశాడు. ఆ తర్వాత మ్యాడ్ సినిమాతో వెండితెరపై హీరోగా అలరించాడు.

మ్యాడ్ సినిమాలో సంగీత్ శోభన్ యాక్టింగ్ ఇష్టపడని వారుండరు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ కుర్రాడి పాత్రలో.. యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు.




