EPFO 3.0 గురించి కీలక అప్‌డేట్‌..ఏటీఎం నుంచి పీఎఫ్‌ డబ్బులు..ఎప్పుడంటే

20 April 2025

Subhash

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) కొత్త నిబంధనలతో మార్పుల గురించి చాలా రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి.

ఈపీఎఫ్‌వో

ఇప్పుడు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన ఈపీఎఫ్‌వో 3.0 గురించి ఒక ప్రకటన చేశారు.

ఈపీఎఫ్‌వో 3.0 అప్‌డేట్‌

ఈపీఎఫ్‌వో తీసుకువస్తున్న ఈ కొత్త నియమాల కారణంగా  చెల్లింపు, ఖాతాకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు ఉంటాయి.

కొత్త నియమాలు

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త అప్‌డేట్‌తో ఉద్యోగులు ఏటీఎం ద్వారా డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

ఈపీఎఫ్‌వో 3.0

ఈపీఎఫ్‌వో చేపడుతున్న కొత్త మార్పుల కారణంగా దేశంలోని 9 కోట్ల మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

ఎంత మందికి ప్రయోజనం

రాబోయే రోజుల్లో కొత్త వెర్షన్‌ 3.0పై క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ వేగంగా జరుగుతుందని, ఈపీఎఫ్‌వో కింద ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

 వెర్షన్‌ 3.0

ఈపీఎఫ్‌వో  3.0 మే లేదా జూన్‌ నెలలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.

సదుపాయం ఎప్పుడు?

దీంతో పాటు ఈపీఎఫ్‌వో ఉద్యోగులు ఏటీఎం ద్వారా పీఎఫ్‌ డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. దీని వల్ల  ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

ఏటీఎం నుంచి డబ్బులు